దేశంలో కరోనా విజృంభిస్తున్న వేళ.. ప్రజలు భయంతో కొవిడ్ టీకాలు, అత్యవసర ఔషధాల (రెమ్డెసివిర్ ఇంజక్షన్ల) కోసం ఆస్పత్రులు, వ్యాక్సినేషన్ సెంటర్ల వద్ద జనం బారులు తీరుతున్నారు. ఈ క్రమంలో కరోనా నిబంధనలు పక్కనబెట్టి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి చర్యలతో కరోనా ముప్పు మరింత పెరిగే అవకాశముంది.
ఒడిశాలోని భద్రక్ వ్యాక్సినేషన్ సెంటర్ వద్ద భౌతిక దూరం నిబంధనలను మరచి జనం బారులు తీరారు. సమస్యను అధిగమించడానికి మరిన్ని వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
![Violation of covid Vaccination guidelines](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11708183_od.jpg)
![Violation of covid Vaccination guidelines](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11708183_2.jpg)
తమిళనాడులోనూ ఇటువంటి పరిస్థితే కనిపించింది. చెన్నైలోని ప్రభుత్వ కిల్పక్ వైద్య కళాశాల వద్ద రెమ్డెసివిర్ ఇంజక్షన్ కోసం క్యూ కట్టారు. భౌతిక దూరం కూడా పాటించలేదు. ఈ పరిస్థితులు చూస్తుంటే కరోనా ముప్పు మరింత పెరిగేలాగే కనిపిస్తోంది.
![Violation of covid Vaccination guidelines](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11708183_1.jpg)
![Violation of covid Vaccination guidelines](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11708183_3.jpg)
![Violation of covid Vaccination guidelines](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11708183_od1.jpg)
పంజాబ్ అమృత్సర్ జిల్లాలో కుటుంబ సభ్యులకు అవసరమైన కరోనా ఔషధాల కోసం జనం క్యూ కట్టారు. ఎలాంటి నిబంధనలు పాటించకుండా.. తమకేమి పట్టనట్టు పక్కపక్కనే ఉంటూ.. కరోనా వ్యాప్తికి మరింత అవకాశాన్ని కల్పిస్తున్నారు.
![Violation of covid Vaccination guidelines](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/whatsapp-image-2021-05-10-at-102646_1005newsroom_1620641824_281.jpeg)
![Violation of covid Vaccination guidelines](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/whatsapp-image-2021-05-10-at-102645_1005newsroom_1620641824_561.jpeg)
![Violation of covid Vaccination guidelines](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11708183_7.jpg)
ఇదీ చూడండి: 'కరోనాపై గెలవాలంటే కఠిన చర్యలు తప్పనిసరి'