పాముకాటుతో చనిపోయిన శునకానికి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు కర్ణాటకలోని హుబ్లీకి చెందిన అదర్గుంచి గ్రామస్తులు. ఆ శునకం రోజూ గ్రామంలో తిరుగుతూ ఉండేది. అదంటే గ్రామస్తులకు చాలా ఇష్టం. అయితే మూడు రోజుల క్రితం అది పాముకాటుకు గురైంది. వెంటనే దాన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే ఆ శునకం చనిపోయింది.
కాగా తమకు ఎంతో దగ్గరైన శునకం మృతితో గ్రామస్తులు కన్నీటిపర్యంతమయ్యారు. దానిపై ప్రేమతో అంత్యక్రియలు నిర్వహించారు.
ఇదీ చూడండి: రంగు తెచ్చిన తంట- వీరంగం సృష్టించిన ఆవు