ETV Bharat / bharat

'మాధవపురం'గా మారిన మహ్మద్​పుర్​.. ఆప్​, భాజపా మాటల యుద్ధం

Village name change in Delhi: దిల్లీలో గ్రామాల పేర్ల మార్పుపై భాజపా దూకుడుగా వ్యవహరిస్తోంది. 40 గ్రామాల పేర్లు మారుస్తామని ప్రకటించిన వారం రోజుల్లోనే దక్షిణ దిల్లీలోని మహ్మ​పుర్​ గ్రామం పేరును మాధవ​పురంగా మార్చింది. ఈ మేరకు ట్వీట్​ చేశారు దిల్లీ భాజపా అధ్యక్షుడు అదేశ్​ గుప్తా. మరోవైపు.. గతవారం భాజపా చేసిన ప్రకటనను అధికార ఆమ్​ ఆద్మీ పార్టీ ఖండించింది.

RENAMING
మాధవపురమ్​గా పేరు మార్పు
author img

By

Published : Apr 27, 2022, 5:54 PM IST

Village name change in Delhi: దక్షిణ దిల్లీలోని మహ్మద్​పుర్​ గ్రామం పేరును మాధవపురంగా మార్చినట్లు భాజపా నేతలు బుధవారం ప్రకటించారు. బానిసత్వపు గుర్తులు తమతో ఉండకూడదని గ్రామస్థులు కోరుకుంటున్నారని, అందుకే ఇలా చేసినట్లు పేర్కొన్నారు. కొత్తగా మాధవ​పురం​గా మార్చిన గ్రామ నామఫలకం వద్ద పార్టీ కార్యకర్తలు, స్థానికులతో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు దిల్లీ భాజపా అధ్యక్షుడు అదేశ్​ గుప్తా. ఆ ఫొటోలను ట్విట్టర్​లో షేర్​ చేశారు.

ఇటువంటి విషయాలన్నింటికి దిల్లీకి 'స్టేట్​ నేమింగ్​ అథారిటీ' ఉందని, అలాంటి ప్రతిపాదనలు వస్తే.. దానిని సమీక్షించి, నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటుందని ఆప్​ ప్రభుత్వం చెబుతోంది. ఈ క్రమంలోనే గ్రామానికి భాజపా నేతృత్వంలో పేరు మార్చటం ప్రాధాన్యం సంతరించుకుంది.

  • माधवपुरम गांव के नामकरण का प्रस्ताव निगम में पास होने के बाद आज गांव के नामकरण की प्रक्रिया को पूरा किया।

    अब से यह गांव मोहम्मदपुर की जगह "माधवपुरम" नाम से जाना जाएगा।

    आजादी के 75 वर्ष बाद भी गुलामी का कोई प्रतीक, चिन्ह हमारा हिस्सा हो, ये कोई भी दिल्लीवासी नही चाहता। pic.twitter.com/0GdfL2YD9M

    — Adesh Gupta (@adeshguptabjp) April 27, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"పేరు మార్చాలన్న ప్రతిపాదనకు మున్సిపల్​ కార్పొరేషన్​ ఆమోదం తెలిపిన క్రమంలో.. మాధవపురం​గా పేరు మార్చే ప్రక్రియ ఈ రోజు పూర్తయింది. ఇప్పటి నుంచి ఈ గ్రామం పేరు మహ్మద్​​పుర్​ కాదు మాధవ​పురం​. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్న క్రమంలో బానిసత్వానికి సంబంధించిన గుర్తులు తమతో ఉండాలని దిల్లీ వాసులు కోరుకోవటం లేదు. భాజపా కౌన్సిలర్​ ప్రతిపాదనను స్థానికులు, భాజపా కార్యకర్తలు ముందుకు తీసుకెళ్లారు. ఆ ప్రతిపాదనకు దక్షిణ దిల్లీ మున్సిపల్​ కార్పొరేషన్​ ఆమోదం తెలిపింది. మాధవ​పురంగా మార్చాలనే ప్రతిపాదనకు ఆమోదం తెలిపి.. గత ఏడాది డిసెంబర్​లో దిల్లీ ప్రభుత్వానికి పంపించగా.. ఆరు నెలలైనా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు."

- అదేశ్​ గుప్తా, దిల్లీ భాజపా అధ్యక్షుడు.

బానిసత్వానికి గుర్తులుగా ఉన్న 40 గ్రామాల పేర్లు మార్చేందుకు ప్రతిపాదనలను కేజ్రీవాల్​ ప్రభుత్వానికి పంపుతామని దిల్లీ భాజపా గత వారం తెలిపింది. అందులో హుమయున్​పుర్​, యూసఫ్​ సరాయ్​, మసూద్​పుర్​, జమ్​రూద్​పుర్​, బెగమ్​పుర్​, సైదుల్​ అజాబ్​, ఫతేపుర్​ బేరి, హౌజ్​ ఖాస్​, షేక్​ సరాయ్​ వంటివి ఉన్నాయి. మరోవైపు.. భాజపాపై విమర్శలు గుప్పించింది ఆమ్​ ఆద్మీ పార్టీ. నింబధనల ప్రకారం ప్రభుత్వం నడుచుకోవటం భాజపాకు ఇష్టం లేదని, అల్లర్లు సృష్టించేందుకు అవకాశాలను వాడుకుంటోందని ఆరోపించింది.

6వేల లౌడ్​స్పీకర్ల తొలగింపు: మరోవైపు.. ఉత్తర్​ప్రదేశ్​లోని మతపరమైన ప్రాంతాల్లో లౌడ్​స్పీకర్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 6వేల లౌడ్​స్పీకర్లను తొలగించామని, మరో 30వేల స్పీకర్ల సౌండ్​ను అనుమతించదగిన పరిమితుల్లో తగ్గించినట్లు సీనియర్​ పోలీసు అధికారి తెలిపారు. శాంతిభద్రతల అంశంపై గత వారం సీనియర్​ అధికారులతో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ సమావేశమైన అనంతరం ఈ ప్రక్రియ మొదలైంది. లౌడ్​స్పీకర్లు తొలగించినా.. మైక్రోఫోన్స్​ ఉపయోగించుకోవచ్చని, అయితే, వాటి శబ్దం పరిధి దాటకూడదన్నారు అధికారి. దాని ద్వారా ప్రజలు ఇబ్బందులు పడకూడదని స్పష్టం చేశారు. జిల్లా స్థాయి అధికారుల నుంచి నివేదిక కోరినట్లు చెప్పారు.

ఇదీ చూడండి: ముఖ్యమంత్రిపై ఎద్దు దాడి.. లక్కీగా..

మే 2 నుంచి మోదీ ఫారిన్ టూర్- 3 దేశాల్లో సుడిగాలి పర్యటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.