ETV Bharat / bharat

విక్రమ్​ మిశ్రికి డిప్యూటీ ఎన్​ఎస్​ఏ బాధ్యతలు - మిశ్రి

Vikram Misri deputy NSA: భారత ప్రభుత్వానికి విస్తృత సేవలందించిన విక్రమ్​ మిశ్రి.. డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారుగా నియమితులయ్యారు. 1989 ఐఎఫ్​ఎస్​ బ్యాచ్​ సభ్యుడైన మిశ్రి.. 2019 నుంచి ఇప్పటివరకు చైనాకు భారత రాయబారిగా విధులు నిర్వహించారు.

vikram misri deputy nsa
విక్రమ్​ మిశ్రికి డిప్యూటీ ఎన్​ఎస్​ఏ బాధ్యతలు
author img

By

Published : Dec 28, 2021, 10:51 AM IST

Vikram Misri deputy NSA: చైనాకు భారత మాజీ రాయబారి విక్రమ్​ మిశ్రి.. నేషనల్​ సెక్యూరిటీ కౌన్సిల్​ సెక్రటేరియట్​లో డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారుగా నియమితులయ్యారు. ఈ విషయాన్ని భారత ప్రభుత్వం సోమవారం ప్రకటించింది.

1989 ఐఎఫ్​ఎస్​ బ్యాచ్​ సభ్యుడైన మిశ్రి.. 2019లో రాయబారి బాధ్యతలు స్వీకరించారు. భారత్​-చైనా సరిహద్దు ఉద్రిక్తతల మధ్య రాయబారిగా కీలక సేవలు అందించారు. విదేశాంగశాఖ, దిల్లీలోని ప్రధాని కార్యాలయంలో విస్తృత సేవలందించారు మిశ్రి. 2014మే- జులై సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు. అంతకుముందు 2012 అక్టోబర్​ నుంచి 2014 మే వరకు నాటి ప్రధాని మన్మోహన్​ సింగ్​కు వ్యక్తిగత కార్యదర్శిగా విధులు నిర్వహించారు. ఐరోపా, ఆఫ్రికా, ఆసియా, ఉత్తర అమెరికాలో భారత్​ మిషన్​లకు ప్రాతినిధ్యం వహించారు. మయన్మార్​, స్పెయిన్​లకు భారత రాయబారిగా కూడా పనిచేశారు.

vikram misri deputy nsa
విక్రమ్​ మిశ్రి

చైనాకు భారత రాయబారిగా.. విక్రమ్​ మిశ్రి స్థానంలో ప్రదీప్​ కుమార్​ రావత్​ నియమిస్తూ ప్రకటన చేసింది భారత ప్రభుత్వం.

ఇదీ చూడండి:- 'ఒమిక్రాన్​ వేళ ఎన్నికలెలా?'.. ఆరోగ్య శాఖతో ఈసీ విస్తృత చర్చ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.