విదేశీ పర్యటనలతో అందరి దృష్టిని ఆకర్షించిన ప్రముఖ టీ స్టాల్ యజమాని (KR Vijayan and Mohana) కేఆర్ విజయన్ (71) శుక్రవారం కన్నుమూశారు. గుండెపోటు కారణంగా విజయన్ మృతిచెందినట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. విజయన్ మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు(kr vijayan and mohana tea shop).
'వారానికి కనీసం రెండ్లుసార్లైనా నాకు వడ, పూరి, చాయ్‌ను అందిస్తూ.. తన పర్యటనల గురించి వివరించే వ్యక్తి చనిపోయినందుకు సంతాపం వ్యక్తం చేస్తున్నాను' అని ప్రముఖ రచయిత ఎన్ఎస్ మాధవన్ ట్వీట్ చేశారు.
విజయన్, ఆయన భార్య మోహన.. 'శ్రీ బాలాజీ కాఫీ హౌస్' పేరుతో కేరళ కొచ్చిలో స్టాల్‌ను (KR Vijayan and Mohana) నడుపుతున్నారు. విదేశీ పర్యటనలు చేయాలన్న ఆసక్తితో వచ్చిన ఆదాయంలో ప్రరి రోజు రూ.300 ఆదా చేసి, మరికొంత అప్పు తీసుకుని పలు దేశాలు సందర్శించారు. ఈ దంపతులు తొలిసారిగా 2007లో ఇజ్రాయెల్ వెళ్లారు. సోషల్ మీడియాలో వీరి గురించి వైరలయ్యాక అనేక మంది వీరికి ఫండింగ్ ఇచ్చారు. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా కూడా 2019లో విజయన్ దంపతుల ఆస్ట్రేలియా ట్రిప్‌కు స్పాన్సర్ చేశారు.
గడిచిన 14 ఏళ్లలో 26 దేశాలు తిరిగారు ఈ దంపతులు. 2019 తర్వాత కొవిడ్ కారణంగా పర్యటనకు విరామం ఇచ్చిన దంపతులు ఈ ఏడాది అక్టోబరు 21-28 మధ్య రష్యాను సందర్శించారు. ఇదే విజయన్‌కు చివరి విదేశీ పర్యటన అయింది.
ఇదీ చూడండి : పెళ్లైన మూడో రోజుకే యువతి ఆత్మహత్య- అమ్మానాన్న అలా చేశారని...