ETV Bharat / bharat

Vijay Rupani: విజయ్​ రూపానీ రాజీనామాకు అదే కారణమా? - విజయ్ రూపానీ గుజరాత్ ముఖ్యమంత్రి

రాజీనామా చేసిన గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీకి (vijay rupani) సున్నితమైన వ్యక్తిగా పేరుంది. అయితే ఇదే.. బలహీనమైన సీఎం అనే పేరు తెచ్చిపెట్టిందని విశ్లేషకులు చెబుతున్నారు. రాజకీయ నాయకుల కన్నా, అధికారులకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం ఆయనకు ప్రతికూలంగా మారినట్లు తెలుస్తోంది.

vijay rupani
విజయ్ రూపానీ
author img

By

Published : Sep 11, 2021, 9:24 PM IST

విజయ్ రామ్నిక్​లాల్ రూపానీ (Vijay Rupani News).. మయన్మార్​లోని రంగూన్ పట్టణంలో 1956 ఆగస్టు 2న జైన కుటుంబంలో జన్మించారు. పాఠశాల విద్యార్థిగా ఉన్నప్పుడే ఆరెస్సెస్​కు చెందిన ఓ విభాగంలో చేరారు. ఆ తర్వాత ఏబీవీపీలో పనిచేశారు. అనంతరం భాజపాలోకి వచ్చారు. న్యాయశాస్త్రంలో విద్యనభ్యసించారు.

అవినీతి, ఆర్థిక సంక్షోభానికి వ్యతిరేకంగా 1974లో విద్యార్థులు, మధ్యతరగతి ప్రజలు చేసిన గుజరాత్ నవనిర్మాణ్ ఉద్యమంలో (Gujarat Navnirman Andolan) రూపానీ కీలకంగా వ్యవహరించారు. దీని ద్వారా తన రాజకీయ నైపుణ్యాలను మెరుగుపర్చుకున్నారు. ఎమర్జెన్సీ సమయంలో ఏబీవీపీలో ఉన్న ఆయన.. సుమారు ఏడాది పాటు జైలులో గడిపారు. 1996-97లో రాజ్​కోట్​ మేయర్​గా ప్రజలకు దగ్గరయ్యారు.

భాజపా అధ్యక్షుడిగా..

2006లో గుజరాత్ టూరిజం డెవలప్​మెంట్ కార్పొరేషన్ హెడ్​గా పనిచేశారు. ఈ సమయంలోనే 'ఖుష్బూ గుజరాత్​ కి' అనే ప్రచార కార్యక్రమాన్ని రూపొందించి.. రాష్ట్రంలోని పర్యటక కేంద్రాలకు విశేష ప్రాచుర్యం కల్పించారు.

రాజ్యసభ సభ్యుడిగా..

సీఎం కాకముందు గుజరాత్​ భాజపా విభాగంలో వివిధ హోదాల్లో సేవలందించారు. 2006 నుంచి 2012 వరకు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. 2014లో రాజ్​కోట్ వెస్ట్ నియోజకవర్గం నుంచి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2016 ఫిబ్రవరి 19న గుజరాత్ భాజపా అధ్యక్షుడిగా ఎంపికయ్యారు.

సీఎంగా...

2016 ఆగస్టులో అప్పటి ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్ (Anandiben Patel) రాజీనామా చేశారు. దళితుల ఆందోళనలను, పాటీదార్ ఉద్యమాన్ని సరిగ్గా నియంత్రించకపోవడం వల్ల ఆమెచేత రాజీనామా చేయించింది భాజపా. ప్రభుత్వ వ్యతిరేకత పెరగడం, పాటీదార్​ కోటా ఉద్యమం హింసాత్మకంగా మారడం వంటి పరిస్థితుల్లో హాట్​సీట్​లోకి వచ్చారు రూపానీ. అప్పటి నుంచి సర్కారును నడిపించుకుంటూ వచ్చారు.

బలహీనత?

మంచితనం బలహీనతగా మారుతుందని పెద్దలు చెబుతుంటారు. విజయ్ రూపానీ (vijay rupani) విషయంలోనూ అదే జరిగింది! సుతిమెత్తగా మాట్లాడే స్వభావం ఉన్న వ్యక్తి అని ఆయనకు పేరుంది. అయితే, అదే ఇమేజ్ 'బలహీనమైన సీఎం' (vijay rupani CM) అన్న పేరు తెచ్చిపెట్టిందని విశ్లేషకులు చెబుతున్నారు. కీలక నిర్ణయాల్లో రాజకీయ నాయకులను కాదని అధికారులకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ఆయనపై అసంతృప్తి పెరిగిందని అంటున్నారు.

దీంతో పాటు కొవిడ్ రెండో వేవ్ నిర్వహణ, అనంతరం తలెత్తిన ఆర్థిక, సామాజిక చిక్కులను పరిష్కరించడంలో విఫలం కావడం కూడా రూపానీ రాజీనామాకు కారణమని పరిశీలకులు చెబుతున్నారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.