ETV Bharat / bharat

viral video: నమస్తే పెట్టలేదని కర్రలతో దాడి

తమకు నమస్కారం​ చేయలేదని ఓ యువకుడిని ఇద్దరు చితకబాదిన ఘటన ఉత్తర్​ప్రదేశ్​ గాజియాబాద్​లో​ జరిగింది. కర్రలతో దాడి చేస్తున్న ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

Ghaziabad goons beat up young man for not saluting
యువకుడిపై కర్రలతో దాడి
author img

By

Published : Jul 21, 2021, 8:44 PM IST

Updated : Jul 21, 2021, 9:22 PM IST

నమస్తే పెట్టలేదని కర్రలతో దాడి

ఉత్తర్​ప్రదేశ్​ గాజియాబాద్​ జిల్లాలోని 'లోనీ' సరిహద్దు ప్రాంతం బీచ్​ రోడ్​లో ఓ యువకుడిని ఇద్దరు దుండగులు కర్రలతో చితకబాదారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

ఇదీ జరిగింది..

'లోనీ' పోలీస్టేషన్​ పరిధిలోని సంగమ్​ విహార్​ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. బాధితుడు, దుండగులు ఒకే కాలనీలో నివసిస్తారు. ఈ క్రమంలోనే జులై 20న బాధితుడు పని కోసం వెళ్తుండగా.. అడ్డుకున్నారు. తమకు నమస్కారం చేయాలని బెదిరించారు. అందుకు అతను నిరాకరించగా విచక్షణ రహితంగా కర్రలతో చితకబాదారు. యువకుడిని కొడుతున్న సమయంలో అక్కడ ఉన్నవారు ఆపేందుకు ప్రయత్నించకుండా.. తమ ఫొన్లతో రికార్డు చేసేందుకే మొగ్గు చూపటం గమనార్హం.

బాధితుడి పేరు రాహుల్​గా పోలీసులు తెలిపారు. అయితే.. వారి మధ్య గతం నుంచే వివాదం కొనసాగుతోందని, ఈ క్రమంలోనే ఓసారి తనను ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని బెదిరించినట్లు బాధితుడు పోలీసులకు తెలిపాడు.

కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దుండగుల కోసం గాలింపు చేపట్టారు. బాధితుడు రాహుల్​ ఆరోగ్యం విషయమంగా ఉన్నట్లు చెప్పారు.

ఇదీ చూడండి: SUICIDE: తుపాకీతో కాల్చుకుని సీఆర్​పీఎఫ్ కానిస్టేబుల్​ ఆత్మహత్య

Last Updated : Jul 21, 2021, 9:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.