ETV Bharat / bharat

వారి సేవలు గుర్తు చేసుకోవాలి: ఉపరాష్ట్రపతి - ఉపరాష్ట్రపతి సమాచారం

స్వాతంత్ర్య సమరయోధుల జీవిత గాథలపై సోషల్​ మీడియాలో వరుస పోస్టులు చేయడం ప్రారంభించారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. నాడు జైలు శిక్ష అనుభవించిన నాయకుల దినచర్యలను చూస్తే దేశంపై వారికి ఉన్న అంచంచలమైన ప్రేమ అర్థమవుతుందని తెలిపారు.

Vice Prez starts series of social media posts on freedom fighters who were in Cellular Jail
వారి సేవలు గుర్తు చేసుకోవాలి: ఉపరాష్ట్రపతి
author img

By

Published : Dec 20, 2020, 7:07 PM IST

స్వాతంత్ర్య పోరాట సమయంలో జైలు శిక్ష అనుభవించిన నాయకులు దినచర్యలను తిరగేస్తే మాతృభూమిపై వారికి ఉన్న ప్రేమ అర్థమౌతుందన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. వారికి సంబంధించిన పోస్టులను సోషల్ ​మీడియా వేదికగా పంచుకున్నారు. భారత స్వాతంత్య్ర సంగ్రామ సమయంలో చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అనేక మంది పాల్గొన్నట్లు తెలిపారు. వారి విరోచిత గాథల్లో ఎటువంటి స్వార్థం లేదన్నారు.

అనేక పోరాటాలతో సంపాదించుకున్న స్వాంతంత్ర్యానికి 75 ఏళ్లు నిండుతోన్న సందర్భంగా ప్రజలు వారి స్ఫూర్తిదాయకమైన కథలను, బలిదానాలను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు వెంకయ్య. మనం జరుపుకునే వార్షికోత్సవాలలో కూడా వారికి తగిన స్థానం కల్పించాలని కోరారు. ఈ క్రమంలో స్వాతంత్ర్య సంగ్రామంలో వీరసావర్కర్​ సేవలను గుర్తు చేసుకున్నారు ఉపరాష్ట్రపతి.

"ఇప్పటి యువత సెల్యూలార్​ జైలును సందర్శించాలి. మన నాయకుల సేవలను గుర్తు చేసుకోవాలి. నివాళులు అర్పించాలి. అలా చేసినప్పుడే వారు కలలు కన్న నవభారత నిర్మాణం సాధ్యమౌతుంది. అందుకు అందరి కృషి అవసరం."

-వెంకయ్య నాయుడు, ఉపరాష్ట్రపతి

ఇదీ చూడండి: వ్యవసాయం ఓ ప్రకృతి కార్యం: ఉపరాష్ట్రపతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.