Chief of the Naval Staff: భారత నూతన నౌకాదళ అధినేతగా ఆర్. హరికుమార్ నియమితులయ్యారు. అడ్మిరల్ కరమ్‌బీర్ సింగ్ స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు వైస్ అడ్మిరల్‌గా కొనసాగారు హరికుమార్.
![Navy Chief Admiral Hari Kumar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13773358_4.jpg)
![Navy Chief Admiral Hari Kumar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13773358_2.jpg)
దిల్లీలోని సౌత్‌బ్లాక్ ఆవరణలో సైనికులు ఆయనకు గౌరవ వందనం చేశారు. పలువురు అధికారులు అడ్మిరల్ హరికుమార్కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు తనకు అరుదైన గౌరవం దక్కిందని హరికుమార్ తెలిపారు.
"భారత నూతన నావికాదళపతిగా బాధ్యతలు స్వీకరించడం ఒక అరుదైన గౌరవం. జాతీయ నౌకాదళ సవాళ్లపై భారత నావికాదళం దృష్టిసారిస్తుంది."
-- అడ్మిరల్ ఆర్. హరికుమార్, నూతన నావికాదళపతి
1962, ఏప్రిల్ 12న జన్మించిన ఆర్. హరికుమార్.. 1983, జనవరి1న ఇండియన్ నేవీలో ఉద్యోగిగా చేరారు. 39 ఏళ్లపాటు పలు విభాగాల్లో సేవలు అందించారు.
![Navy Chief Admiral Hari Kumar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13773358_1.jpg)
అడ్మిరల్ కరమ్‌బీర్ సింగ్ రెండున్నర సంవత్సరాలపాటు పదవిలో కొనసాగారు. పదవీవిరమణ సమయంలో మీడియాతో మాట్లాడారు.
" రెండున్నరేళ్ల పదవీకాలంలో గల్వాన్ ఘర్షణలు, కొవిడ్-19 సంక్షోభం చూశాను. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొవడంలో నేవీ అత్యుత్తమ పనితనాన్ని ప్రదర్శించింది. నావికాదళం.. ఎల్లప్పుడూ ప్రజలకు, జాతికి సేవచేస్తూ అందుబాటులో ఉంటుంది.
-- అడ్మిరల్ కరమ్‌బీర్ సింగ్, మాజీ నౌకాదళాధిపతి
ఇదీ చూడండి: పింఛన్ల విరాళాలకు త్వరలో ప్రధాని మోదీ పిలుపు