ETV Bharat / bharat

'అయోధ్య' విరాళాల కోసం దేశవ్యాప్తంగా ప్రచారం - మోహన్ భగవత్

విశ్వహిందూ పరిషత్​, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్​ ఆధ్వర్యంలో అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం విరాళాలు సేకరించేందుకు దేశవ్యాప్త కార్యక్రమం చేపట్టనున్నారు. జనవరి 15 నుంచి ఫిబ్రవరి 27 వరకు ఈ కార్యక్రమం చేపట్టేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు నిర్వాహకులు.

VHP to launch nationwide campaign to collect funds for Ram temple in Ayodhya
'అయోధ్య రామ మందిర విరాళాల కోసం భారీ కార్యక్రమం'
author img

By

Published : Nov 25, 2020, 8:00 AM IST

అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి విరాళాలు సేకరించేందుకు దేశవ్యాప్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనుబంధ సంస్థ విశ్వ హిందూ పరిషత్​. శ్రీ రామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్​తో కలిసి​ దేశవ్యాప్తంగా ప్రచారం చేపట్టేందుకు సిద్ధమవుతోంది.

ఈ మేరకు జనవరి 15 నుంచి ఫిబ్రవరి 27 వరకు విరాళాల సేకరణలో నిమగ్నం కానున్నట్లు విశ్వ హిందూ పరిషత్​ వెల్లడించింది.

మరోవైపు.. ఆర్​ఎస్​ఎస్​ చీఫ్ మోహన్ భగవత్​తో కలిసి ప్రచార కార్యక్రమం గురించి చర్చించనున్నట్లు శ్రీ రామ జన్మ భూమి తీర్థ​ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది. ఆర్​ఎస్​ఎస్​ అనుబంధ సంస్థలు ఈ కార్యక్రమం విజయవంతానికి సహకరించాలని కోరనుంది. దేశవ్యాప్తంగా 4 వేల గ్రామాల్లో 11 కోట్ల కుటుంబాల నుంచి విరాళాలు సేకరించడమే లక్ష్యంగా ముందుకు సాగనున్నాయి.

ఇదీ చదవండి:ఇప్పట్లో కాంగ్రెస్​కు కొత్త సారథి లేనట్టే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.