ETV Bharat / bharat

ఎన్నికల వేళ ఖర్గేకు షాక్.. రూ. 100 కోట్లు కట్టాలంటూ VHP లీగల్​​ నోటీసులు - అమిత్ షా పై ఎన్నికల కమిషన్​కు కాంగ్రెస్ లేఖ

కాంగ్రెస్​ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు లీగల్​ నోటీసులు పంపించింది విశ్వహిందూ పరిషత్​. 14 రోజుల్లోగా రూ. 100 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేసింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బజరంగ్ దళ్​పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించింది.

vhp sommons to kharge
vhp sommons to kharge
author img

By

Published : May 7, 2023, 7:38 AM IST

Updated : May 7, 2023, 9:06 AM IST

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ మేనిఫెస్టోలోని బజరంగ్ దళ్ ప్రస్తావన రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. మేనిఫెస్టోలో బజరంగ్ దళ్ పరువుకు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు విశ్వహిందూ పరిషత్ లీగల్ నోటీసు పంపింది. 14 రోజుల్లోగా రూ. 100 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేసింది. చండీగఢ్‌లోని వీహెచ్​పీ, దాని యువజన అనుబంధ సంస్థ బజరంగ్‌దళ్ ఈ నెల 4న ఈ నోటీసు జారీ చేశాయి. అయితే ప్రస్తుతం దీనిపై కాంగ్రెస్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇటీవలే కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేసింది. మేనిఫెస్టోలోని పదో పేజీలో.. ఉగ్రవాద సంస్థలైన అల్‌ఖైదా, ఐసీస్‌లతో సంబంధాలున్న పీఎఫ్ఐ, సిమిలతో బజరంగ్‌ దళ్‌ను పోల్చి దాని ప్రతిష్ఠకు భంగం కలిగించారని లీగల్ నోటీసులో వీహెచ్​పీ పేర్కొంది.

అంతకుముందు తాము​ అధికారంలోకి వస్తే.. రాష్ట్రంలో బజరంగ్‌దళ్​పై నిషేధం విధిస్తామని కాంగ్రెస్​ తమ మేనిఫెస్టోలో ప్రకటించింది. ఈ విషయంపై పలు హిందూ సంఘాల నుంచి అభ్యంతరాలు వెల్లువెత్తాయి. దీనిపై స్పందించిన కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్​ తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేది లేదని స్పష్టం చేశారు. బజరంగ్​ దళ్​కు, ఆంజనేయ స్వామికి సంబంధం లేదు అన్నారు. తాను కూడా రాముడు, ఆంజనేయ స్వామి, శివుడికి భక్తుడేనంటూ వివరించారు. రోజు హనుమాన్ చాలీసా పఠిస్తానని శివకుమార్ తెలిపారు.

మరోవైపు కాంగ్రెస్​ వ్యాఖ్యలకు బీజేపీ ఘాటుగా స్పందించింది. ఈ అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గతంలో రాముడిని జైల్లో పెట్టిన కాంగ్రెస్.. ఇప్పుడు బజరంగ్ బలి అని నినదించేవారిని జైల్లో పెట్టాలని చూస్తోందని ఆరోపించారు. తమ ఎన్నికల ప్రణాళికలో కర్ణాటకను నంబర్‌ వన్‌ చేసే రోడ్‌ మ్యాప్‌ను ప్రకటిస్తే.. కాంగ్రెస్ పార్టీ బజ్‌రంగ్‌బలి అని నినదించే వారిని జైల్లో పెట్టాలని చూస్తోందని ప్రధాని మోదీ అన్నారు.

ఎన్నికల కమిషన్​కు కాంగ్రెస్​ లేఖ..
'కాంగ్రెస్ పార్టీ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది' అని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఆరోపణలపై మండిపడ్డారు కాంగ్రెస్​ నేతలు. తమ పార్టీకి ఉగ్రవాద రంగు పూసేందుకు ప్రయత్నిస్తున్న మోదీపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి లేఖ రాసింది కాంగ్రెస్​. ప్రధానమంత్రి బళ్లారి ప్రసంగంలో కాంగ్రెస్​పై చేసిన విమర్శల పట్ల మాకు అభ్యంతరాలు ఉన్నాయని తెలిపింది. ఆయన ప్రసంగం పూర్తిగా అవాస్తవమని, అవి సమాజానికి హానికరమైన రీతిలో ఉన్నాయంటూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు రణదీప్ సూర్జేవాలా, కేసీ వేణుగోపాల్ ఈసీకి పంపిన లేఖలో పేర్కొన్నారు.

సమీపిస్తున్న ఎన్నికలు..
కర్ణాటక అసెంబ్లీకి మే 10న ఎన్నికలు జరగనున్నాయి. సోమవారంతో ప్రచార పర్వం ముగియనుంది. మే 13న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఆ రాష్ట్రంలో మొత్తం 224 సీట్లు ఉన్నాయి. ప్రస్తుతం 114 సీట్లతో బీజేపీ అధికారంలో ఉంది. కాంగ్రెస్​కు 76, జేడీఎస్​కు 26 సీట్లు ఉండగా.. 8 సీట్లు ఖాళీగా ఉన్నాయి.

Last Updated : May 7, 2023, 9:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.