ETV Bharat / bharat

జనాకర్షక పథకాల కన్నా... జనహిత పథకాలే మిన్న: వెంకయ్యనాయుడు - Former Vice President of India Venkaiah Naidu

Venkaiah Naidu spoke about government schemes: దేశంలో జనాకర్షక పథకాల కన్నా జనహిత పథకాలకు ప్రాధాన్యత ఇవ్వాలని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్‌లో స్వర్ణ భారత్ ట్రస్ట్, యశోద హాస్పిటల్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.

venkaiah naidu
వెంకయ్యనాయుడు
author img

By

Published : Apr 2, 2023, 3:12 PM IST

Updated : Apr 2, 2023, 5:28 PM IST

ముచ్చింతల్​లో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించన వెంకయ్యనాయుడు

Venkaiah Naidu spoke about government schemes: పేదలకు దీర్ఘకాలిక మేలు కలగాలంటే తాత్కాలిక, జనాకర్షక పథకాల బదులు శాశ్వత ప్రాతిపదికన జనహితమైన కార్యక్రమాలు ప్రవేశపెట్టి అమలు చేయాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. అందుకోసం జనహితమైన విద్య, వైద్యం, నైపుణ్యాల పెంపు పథకాలకు నిధులు కేటాయించి అమలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలకు సూచించారు.

పాశ్చాత్య ధోరణుల ఒరవడిలో కొట్టుకుపోతూ చిన్న పిల్లలు, యువత సహజసిద్ధమైన ఆహారం కానటువంటి జంక్​ఫుడ్​ తింటూ అనారోగ్యాలు కొని తెచ్చుకుంటున్నారని ప్రస్తావించారు. పౌష్టికాహారం తీసుకోవడంతో పాటు నిత్యం ఉదయం 6 గంటలకు నిద్ర లేచి వ్యాయామం, యోగా, ధ్యానం చేసినట్లైతే ఆరోగ్యవంతులుగా ఉండవచ్చని తెలిపారు. మానవ మేథస్సు, సృజనాత్మక శక్తి ఉండాలంటే యువత సొంతంగా ఆలోచించాలి తప్ప.. ప్రతిదీ గూగుల్‌పై ఆధారపడవద్దని అన్నారు.

అలాగే కొనసాగితే కొద్ది రోజుల్లో సొంత ఆలోచనలు పోయి పూర్తిగా నిస్తేజమవుతారని హెచ్చరించారు. అతిగా మొబైల్‌ ఫోన్ల వాడకం కూడా సరికాదని.. ప్రకృతితో మమేకమై పుస్తక పఠనంపై ప్రత్యేక దృష్టి సారిస్తే చురుకు పెరుగుతుందని సూచించారు. నెల్లూరు, విజయవాడ, హైదరాబాద్‌లో స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యా, వైద్యం సేవలతో పాటు గ్రామీణ మహిళలు, యువత సొంత కాళ్లపై నిలబడేందుకు అవసరమైన నైపుణ్యాల పెంపు కోసం వివిధ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉపాధికి ఉత్తమ బాటలు వేస్తున్నామని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. స్వర్ణ భారత్​ ట్రస్టు సేవలను ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం కొనియాడారు. అట్టడుగు వర్గాల పేదలను గుర్తించి వారికి సేవ చేయడం నిజంగా అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కామినేని శ్రీనివాస్‌, యశోద హాస్పిటల్స్ ఛైర్మన్ డాక్టర్ సురేంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

"పేదలకు దీర్ఘకాల మేలు కలగాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తాత్కాలిక, జనాకర్షక పథకాల బదులు శాశ్వత ప్రాతిపదికన జనహితమైన కార్యక్రమాలు ప్రవేశపెట్టి అమలు చేయాలి. శాశ్వత జనహితమైన విద్య, వైద్యం, నైపుణ్యాల పెంపు పథకాలకు నిధులు కేటాయించి అమలు చేయాలి. పేద ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతో హైదరాబాద్​, నెల్లూరు, విజయవాడలో స్వర్ణ బారత్​ ట్రస్ట్​ ద్వారా ఉచిత వైద్య శిబిరాలు, విద్యార్థులకు వృత్తి నైపుణ్య శిక్షణ అందిస్తున్నాము". - వెంకయ్య నాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి

ఇవీ చదవండి:

Last Updated : Apr 2, 2023, 5:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.