ETV Bharat / bharat

'టీకా తీసుకున్నా జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి' - Harsh Vardhan reviews COVID-19 vaccination preparedness

కోరనా టీకా పంపిణీ ప్రారంభం కానున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఏర్పాట్లపై అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్దన్​. నిర్మాణ్​ భవన్ ఆవరణలో ఏర్పాటు చేసిన కొవిడ్ కంట్రోల్​ రూంను పరిశీలించారు. కరోనా అంతానికి శనివారమే ఆరంభమని మరో కార్యక్రమంలో అన్నారు. టీకా తీసుకున్నాక కూడా ప్రజలు జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి అని ఆరోగ్యమంత్రి స్పష్టం చేశారు.

Vardhan reviews preparedness for nationwide COVID-19 vaccination drive
'టీకా తీసుకున్నా జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి'
author img

By

Published : Jan 16, 2021, 5:32 AM IST

దేశవ్యాప్తంగా కోరనా వ్యాక్సిన్ పంపిణీ శనివారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అధికారుల సన్నద్ధతపై శుక్రవారం సాయంత్రం దిల్లీలో సమీక్ష నిర్వహించారు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్​. విజ్ఞాన్​ భవన్​లో ఏర్పాటు చేసిన కొవిడ్​ కంట్రోల్​ రూంను పరిశీలించారు. టీకా నిర్వహణకు ప్రభుత్వం ఉపయోగించే కొవిన్​ యాప్​పై అధికారులతో చర్చించారు. స్వదేశంలో అభివృద్ధి చేసిన ఆక్స్​ఫర్డ్​ ఆస్ట్రాజెనెకా- కొవిషీల్డ్, బారత్​బయోటెక్​-కొవాగ్జిన్ టీకాలు 100శాతం సురక్షితమైనవి హర్షవర్ధన్ మరోసారి స్పష్టం చేశారు.

భారత వాతావరణ శాఖ 146వ వ్యవస్థాపక దినోత్సవంలోనూ ఆరోగ్యమంత్రి పాల్గొన్నారు. కరోనా మహమ్మారి అంతానికి వాక్సినేషన్​ ప్రక్రియ ఆరంభమని చెప్పారు. టీకాలు తీసుకున్న తర్వాత కూడా ప్రజలు కరోనా జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

ఇదీ చూడండి: 'స్పుత్నిక్​-వీ' మూడో దశ ట్రయల్స్​కు డీసీజీఐ అనుమతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.