ETV Bharat / bharat

హనీమూన్ కోసం వెళ్లి.. తొక్కిసలాటలో వైద్యుడు మృతి - వైష్ణోదేవి తొక్కిసలాట

Vaishno Devi incident doctor: వివాహం జరిగిన నెల రోజులకే.. వైష్ణోదేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో యూపీ వైద్యుడు ప్రాణాలు కోల్పోవడం.. ఆయన కుటుంబంలో విషాదం నింపింది. హనీమూన్ కోసం వెళ్లిన సమయంలో ఈ ఘటన జరగ్గా.. స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

Vaishno Devi incident
Vaishno Devi incident
author img

By

Published : Jan 2, 2022, 5:45 PM IST

Doctor death Vaishno Devi stampede: అప్పుడే కొత్త జీవితం మొదలు పెట్టారాయన.. అంతలోనే విధి వక్రించింది. హనీమూన్ కోసమని వెళ్లిన ఆయనను దురదృష్టం వెంటాడింది. వైష్ణోదేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఆ వైద్యుడి ప్రాణాలను కబళించింది. విషాదకరమైన ఈ ఘటనలో ఉత్తర్​ప్రదేశ్ గోరఖ్​పుర్​కు చెందిన 30 ఏళ్ల డాక్టర్ అరుణ్ ప్రతాప్ సింగ్ సైతం ఉండటం.. స్థానికులను కలచివేస్తోంది.

స్మార్ట్​ వాచ్​ కారణంగా...

అరుణ్ ప్రతాప్ సింగ్, డాక్టర్ అర్చనా సింగ్​కు డిసెంబర్ 1న వివాహం జరిగింది. తన స్నేహితులతో కలిసి ప్రతాప్ సింగ్ దంపతులు డిసెంబర్ 29న వైష్ణోదేవి దర్శనార్థం ఇంటి నుంచి బయల్దేరారు. కారు అద్దెకు తీసుకొని రోడ్డు మార్గంలో కశ్మీర్​కు వెళ్లారు. డిసెంబర్ 31న రాత్రి.. దర్శనం కోసం మాతా వైష్ణోదేవి మందిరంలోకి ప్రవేశించారు. చేతికి స్మార్ట్​ వాచ్ ఉన్నందున వైద్యుడి భార్య, స్నేహితులను.. సిబ్బంది ఆలయంలోకి అనుమతించలేదు. దీంతో గడియారాన్ని బయట డిపాజిట్ చేసేందుకు వీరంతా బయటకు వచ్చేశారు. ఈ సమయంలో లోపలే ఉన్న ప్రతాప్ సింగ్.. తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయారు.

Vaishno Devi incident
అరుణ్ సింగ్ దంపతులు

UP doctor in Vaishno devi stampede:

అరుణ్ సింగ్ మరణ వార్తను టీవీ ఛానళ్లలో చూసి తెలుసుకున్నామని అతడి తండ్రి సత్య ప్రకాశ్ సింగ్ తెలిపారు. ఈ ఘటనతో.. అరుణ్ సింగ్ సొంతూరైన చౌరీచౌరా గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆదివారం ఆయన మృతదేహం స్వస్థలానికి వస్తుందని తెలుసుకొని పెద్ద ఎత్తున అరుణ్ సింగ్ నివాసానికి చేరుకున్నారు. తమ వైద్యుడి అకాల మరణంపై గ్రామస్థులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

అరుణ్ సింగ్ గోరఖ్​పుర్​లో నివసించేవారని... షాపుర్ ప్రాంతంలో హింద్ ఆస్పత్రిని నడిపించేవారని ఆయన తండ్రి వెల్లడించారు. కరోనా సమయంలో రోగులకు 24 గంటలు సేవలు అందించారని అరుణ్ సన్నిహితులు చెబుతున్నారు. వాతావరణం అనుకూలించకపోవడం వల్ల రోడ్డు మార్గంలో ఆయన మృతదేహాన్ని తీసుకొస్తున్నారు. చౌరీచౌరా గ్రామంలోనే ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.

పరిహారం పెంపు..

మరోవైపు, వైష్ణోదేవి ఆలయం తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబ సభ్యులకు పరిహారం మొత్తాన్ని పెంచారు. ఇదివరకు రూ.10 లక్షలు ప్రకటించగా.. మరో రూ.5 లక్షలను బాధిత కుటుంబ సభ్యులకు అందించాలని నిర్ణయించినట్లు జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ సిన్హా వెల్లడించారు. ఈ మేరకు వైష్ణోదేవి ఆలయ బోర్డు సభ్యులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. మృతుల కుటుంబాలకు కేంద్రం నుంచి రూ.2 లక్షలు పరిహారంగా అందనున్నాయి.

'ఆధారాలు ఉంటే ఇవ్వండి'

కాగా, ఈ ఘటనకు సంబంధించి ఏవైనా ఆధారాలు ఉంటే సమర్పించాలని ప్రజలకు కశ్మీర్ డివిజనల్ కమిషనర్ పిలుపునిచ్చారు. ఎలక్ట్రానిక్ ఆధారాలు, సాక్ష్యాలు ఉంటే అధికారులకు ఇవ్వాలని స్పష్టం చేశారు. ప్రత్యక్షంగా హాజరై వివరాలు తెలియజేయాలనుకున్నవారు.. జనవరి 5న విచారణ కమిషన్ ముందుకు రావాలని ప్రకటన విడుదల చేశారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.