ETV Bharat / bharat

కొవిడ్​ టీకా తీసుకోని ఉద్యోగులకు జీతం కట్​! - కరోనా కేసులు

Vaccine Restrictions: దేశానికి కరోనా మూడో ముప్పు పొంచి ఉందని అధ్యయనాలు వెలువడుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు నిబంధనలను కఠినతరం చేస్తున్నాయి. టీకా తీసుకోని ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించబోమని పంజాబ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. వ్యాక్సిన్​ తీసుకోని వారు బహిరంగ ప్రదేశాల్లో తిరగటం నిషేధించింది హరియాణా ప్రభుత్వం.

vaccine restrictions
కరోనా టీకా
author img

By

Published : Dec 22, 2021, 7:51 PM IST

Vaccine Restrictions: దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో కరోనా నిబంధనలను కఠినతరం చేస్తున్నాయి పలు రాష్ట్ర ప్రభుత్వాలు. ప్రతి ఒక్కరు టీకా తప్పనిసరిగా తీసుకోవాలని ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ క్రమంలో పంజాబ్ ప్రభుత్వం 'నో జాబ్.. నో సాలరీ' పేరిట కొత్త విధానాన్ని తీసుకువచ్చింది. టీకా తీసుకోని ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఉండవన్న మాట. ఉద్యోగులు సింగిల్ డోసు లేదా డబుల్ డోసు తీసుకున్నవారు తమ టీకా ధ్రువీకరణ పత్రాలను సంబంధిత వెబ్​సైట్​లో అప్​లోడ్​ చేయాలని స్పష్టం చేసింది. ఒప్పంద, అవుట్​ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయని పేర్కొంది. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే.. అందుకు సంబంధించిన మెడికల్ పత్రాలను చూపించాలని తెలిపింది.

నో ఎంట్రీ..

Haryana Vaccine Restrictions: కరోనా టీకాలు తీసుకోని వారిపై హరియాణా కూడా కఠిన చర్యలు తీసుకుంటోంది. వ్యాక్సిన్ తీసుకోనివారికి బహిరంగ ప్రదేశాల్లో తిరగటాన్ని నిషేధించినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి అనిల్ విజ్​ తెలిపారు. 2022 జనవరి 1 నుంచి ఈ నిబంధనలు అమలులోకి వస్తాయని స్పష్టం చేశారు. ఈ మేరకు రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించారు.

ఈ నిబంధనల ప్రకారం.. ఫంక్షన్​ హాల్స్​, ప్రభుత్వ కార్యాలయాలు, మార్కెట్లు తదితర బహిరంగ ప్రదేశాల్లోకి అనుమతి ఉండదని మంత్రి అనిల్ విజ్ పేర్కొన్నారు.

హరియాణాలో ఇప్పటివరకు ఒమిక్రాన్ వేరియంట్ వెలుగుచూడలేదు. అయినప్పటికీ ప్రభుత్వం కఠిన నిబంధనలు విధిస్తోంది. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు 3 కోట్ల 11 లక్షల టీకా డోసులు పంపిణీ జరిగింది.

ఆంక్షల చట్రంలోకి దిల్లీ..

Covid Restrictions in Delhi: దేశంలో కరోనా కేసుల పెరుగుదల, ఒమిక్రాన్ కలకలం నేపథ్యంలో దిల్లీ ప్రభుత్వం తగు జాగ్రత్తలు పాటిస్తోంది. క్రిస్మస్​, నూతన సంవత్సర వేడుకలు ఉన్నందున వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రదేశాలపై దృష్టి సారించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. జనం గుంపులుగా ఉండే ప్రదేశాల్లో మాస్కులు, భౌతిక దూరం తప్పనిసరిగా పాటించేలా తగు చర్యలు తీసుకోవాలని తెలిపింది. ఇందుకోసం ప్రత్యేక టీమ్​లను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించింది.

కర్ణాటకలో..

Omicron Cases in Karnataka: ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి పెరుగుదలతో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. జిల్లాల్లో టెస్టింగ్​, ట్రాకింగ్​ను తప్పనిసరిగా నిర్వహించాలని అధికారులను ఆదేశించింది. ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్​ ఐసోలేషన్​ పాటించాలని ఆంక్షలు విధించింది. ప్రైమరీ కాంటాక్ట్స్​కు ఐసోలేషన్​లో ఎనిమిది రోజులకు తప్పనిసరిగా టెస్టింగ్ నిర్వహించాలని తెలిపింది. పాజిటివ్​గా తేలిన వ్యక్తులను పీహెచ్​సీ స్థాయిలో పర్యవేక్షించాలని విధివిధానాలను జారీ చేసింది.

కేరళలో..

Omicron Cases in kerala: కేరళలో ఒమిక్రాన్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. బుధవారం ఒక్కరోజే 9 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా.. మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 24కు చేరింది. యూకే, టాంజానియా, ఘనా, ఐర్లాండ్​ నుంచి వచ్చిన వారికి కరోనా పాజిటివ్ తేలినట్లు అధికారులు తెలిపారు.

జైపుర్​లో..

Omicron Cases in Jaipur: రాజస్థాన్​లోనూ ఒమిక్రాన్ కలకలం రేపుతోంది. తాజాగా జైపుర్​లో నలుగురు ఒమిక్రాన్ బారిన పడ్డారు. వారిలో కరోనా లక్షణాలు పెద్దగా కనిపించట్లేదని వైద్యులు తెలిపారు.

ఇదీ చదవండి: 'బూస్టర్ డోసు ఎప్పుడు పంపిణీ చేస్తారు?'

India Corona cases: 575 రోజుల కనిష్ఠానికి కరోనా యాక్టివ్​ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.