దేశంలో కరోనాపై పోరాటానికి వ్యాక్సిన్ ఉద్యమం ప్రారంభమైంది. ఆక్స్ఫర్డ్ 'కొవిషీల్డ్' టీకాను ఉత్పత్తి చేస్తోన్న సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి మొత్తం 56.5లక్షల టీకా డోసులను వివిధ రాష్ట్రాలకు పంపనున్నట్టు పౌర విమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పూరీ తెలిపారు. పుణె కేంద్రంగా.. 13 నగరాలకు ఈ వ్యాక్సిన్ సరఫరా కానుందని ట్విట్టర్ వేదికగా ఆయన వెల్లడించారు.
-
Today @airindiain @flyspicejet @goairlinesindia & @IndiGo6E will operate 9 flights from Pune with 56.5 lakh doses to Delhi, Chennai, Kolkata, Guwahati, Shillong, Ahmedabad, Hyderabad, Vijayawada, Bhubaneswar, Patna, Bengaluru, Lucknow & Chandigarh.
— Hardeep Singh Puri (@HardeepSPuri) January 12, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Today @airindiain @flyspicejet @goairlinesindia & @IndiGo6E will operate 9 flights from Pune with 56.5 lakh doses to Delhi, Chennai, Kolkata, Guwahati, Shillong, Ahmedabad, Hyderabad, Vijayawada, Bhubaneswar, Patna, Bengaluru, Lucknow & Chandigarh.
— Hardeep Singh Puri (@HardeepSPuri) January 12, 2021Today @airindiain @flyspicejet @goairlinesindia & @IndiGo6E will operate 9 flights from Pune with 56.5 lakh doses to Delhi, Chennai, Kolkata, Guwahati, Shillong, Ahmedabad, Hyderabad, Vijayawada, Bhubaneswar, Patna, Bengaluru, Lucknow & Chandigarh.
— Hardeep Singh Puri (@HardeepSPuri) January 12, 2021
ఇదీ చదవండి: రానున్న నెలల్లో 30కోట్ల మందికి టీకా: మోదీ
"దేశంలో వ్యాక్సిన్ ఉద్యమం ప్రారంభమైంది. పుణె నుంచి దిల్లీ, చెన్నైకి స్పైస్ జెట్, గో ఎయిర్ విమనాలు బయల్దేరాయి. 'ఎయిర్ ఇండియన్', 'ఫ్లై స్పైస్‌జెట్', 'గోఎయిర్లైన్స్ ఇండియా', 'ఇండిగో6ఈ'లకు చెందిన 9 విమానాల ద్వారా.. దిల్లీ, చెన్నై, కోల్‌కతా, గువాహటి, షిల్లాంగ్, అహ్మదాబాద్, హైదరాబాద్, విజయవాడ, భువనేశ్వర్, పట్నా, బంగాల్ ప్రాంతాలకు టీకా సరఫరా కానుంది."
- హర్దీప్ సింగ్ పూరీ, పౌర విమానయాన మంత్రి
ఇదీ చదవండి: 'టీకాల కోసం ప్రభుత్వం ఆర్డర్- ఒక్కోటి రూ.210'
తొలి విడతలో భాగంగా..
దేశ వ్యాప్తంగా ఈ నెల 16న కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం కానుండగా.. తొలివిడతలో భాగంగా పుణె నుంచి దిల్లీకి కొవిషీల్డ్ టీకాను పంపినట్టు తెలిపారు అధికారులు. ఈ మేరకు స్పైస్‌జెట్ ద్వారా.. మొత్తం 34 పెట్టేల్లో 1,088 కిలోగ్రాముల వ్యాక్సిన్‌ను.. కట్టుదిట్టమైన భద్రత నడుమ సరఫరా చేశామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: తొలి దశలో టీకా ఫ్రీ- త్వరలో 4 వ్యాక్సిన్లు: మోదీ