ETV Bharat / bharat

నేటి నుంచి 45 ఏళ్లు పైబడిన వారికి టీకా - కొవిడ్​ టీకా పంపిణీ

కరోనా టీకా పంపిణీలో భాగంగా నేటి నుంచి 45 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్​ అందించనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసింది కేంద్రం. అలాగే టీకా డోసుల వృథాపై అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పలు సూచనలు చేసింది.

covid vaccination
45 ఏళ్లు పైబడిన వారికి టీకా
author img

By

Published : Apr 1, 2021, 5:15 AM IST

Updated : Apr 1, 2021, 8:02 AM IST

భారత్‌లో కరోనా రెండోదశవ్యాప్తి భయపెడుతున్న వేళ మరో కీలక ఘట్టానికి నేడు తెర లేవనుంది. జనవరి 16 నుంచి ఆరోగ్య, ఫ్రంట్‌లైన్‌ సిబ్బందికి, మార్చి 1 నుంచి 45-59 ఏళ్ల మధ్య దీర్ఘకాలికవ్యాధిగ్రస్తులకు కరోనా టీకా పంపిణీని ప్రారంభించిన కేంద్రం నేటి(ఏప్రిల్​ 1 ) నుంచి 45ఏళ్లు పైబడిన అందరికీ టీకా అందించనుంది. ఇందు కోసం దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఏర్పాట్లు చేశారు.

ఈ క్రమంలోనే టీకా డోసుల వృథాపై ప్రధానంగా దృష్టి సారించింది కేంద్రం. వృథాను ఒక్కశాతంలోపే కట్టడి చేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ.

కేంద్రం సూచనల్లోని కీలక అంశాలు..

  • కరోనా టీకా కవరేజ్​ తక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి, దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి.
  • టీకా వృథాను ఒకశాతం లోపునకు పరిమితం చేయాలి.
  • దేశవ్యాప్తంగా టీకా వృథా సగటు 6 శాతంగా ఉంది. దానిని తగ్గించేందుకు ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించాలి.
  • టీకాల కాల పరిమితి ముగియకముందే.. సకాలంలో అందుబాటులో ఉన్న స్టాక్​ను వినియోగించుకోవాలి.
  • ఇప్పటి వరకు వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, 60 ఏళ్లుపైబడిన వారు, 45 ఏళ్లు దాటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 6.30 కోట్ల పైచిలుకు మందికి కేంద్రం టీకాలు పంపిణీ చేసింది.

ఇదీ చూడండి: 'మహా'లో 39 వేల కేసులు- కశ్మీర్​ స్కూళ్లలో కరోనా కలకలం

Last Updated : Apr 1, 2021, 8:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.