ETV Bharat / bharat

మే 5నే భారత్​ నుంచి టీకాల ఎగుమతి బంద్! - వ్యాక్సిన్ ఎగుమతి ఆర్​టీఐ దరఖాస్తు

కరోనా టీకా డోసుల ఎగుమతిని మే ఐదో తేదీనే నిలిపివేసినట్లు కేంద్రం స్పష్టం చేసింది. ఇప్పటివరకు మొత్తం 6.63 కోట్ల డోసులను వివిధ దేశాలకు అందించినట్లు తెలిపింది. ఆర్​టీఐ దరఖాస్తుకు సమాధానంగా ఈ వివరాలను వెల్లడించింది.

vaccine exports india halted on may 5 as per an RTI reply
RTI: మే 5నే టీకాల ఎగుమతి బంద్
author img

By

Published : May 31, 2021, 3:44 PM IST

దేశంలో కరోనా టీకాల కొరత నేపథ్యంలో మే 5నే వ్యాక్సిన్ల ఎగుమతి(vaccine exports)ని భారత ప్రభుత్వం నిలిపివేసినట్లు తెలుస్తోంది. సమాచార హక్కు(RTI) దరఖాస్తు ద్వారా ఈ విషయం వెల్లడైంది. పుణెకు చెందిన ప్రఫుల్ సర్దా అనే సామాజిక కార్యకర్త అభ్యర్థనకు స్పందించిన విదేశాంగ శాఖ.. టీకా ఎగుమతుల వివరాలు వెల్లడించింది. దేశంలో టీకాల ఉత్పత్తి, వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకొనే భవిష్యత్తులోనూ టీకా ఎగుమతులు ఉంటాయని స్పష్టం చేసింది.

ఎగుమతులు ఎన్నంటే?

ఆర్​టీఐ గణాంకాల ప్రకారం 47 దేశాలకు కోటి ఏడు లక్షల 15 వేల డోసులను గ్రాంటు కింద అందించింది కేంద్రం. మరో 3 కోట్ల 57 లక్షల 92 వేల టీకాలను 26 దేశాలకు విక్రయించింది. కొవాక్స్ కార్యక్రమం కింద కోటి 98 లక్షల 63 వేల డోసులను 47 దేశాలకు విక్రయించింది. మొత్తంగా 6 కోట్ల 63 లక్షల 70 వేల టీకా డోసులను వివిధ దేశాలకు అందించింది.

అయితే, ఎగుమతులు నిలిపివేసిన విషయం మినహా మిగిలిన ప్రశ్నలకు కేంద్రం సమాధానం ఇవ్వలేదని ఆర్​టీఐ కార్యకర్త సర్దా పేర్కొన్నారు. టీకా ఎగుమతులపై నిర్ణయం తీసుకునేందుకు ఏర్పాటు చేసిన కమిటీ, అందులోని సభ్యుల వివరాలు కోరగా.. తమ వద్ద సమాచారం లేదని బదులిచ్చినట్లు చెప్పారు. ఇంత భారీ స్థాయిలో టీకాలను విరాళంగా ఇవ్వడం వెనక ఏ మంత్రిత్వ శాఖ ఉందో తెలియకపోవడం ఆశ్చర్యకరమని అన్నారు.

కేంద్ర ఆరోగ్య శాఖ అనుమతితో ఎగుమతి చేసిన టీకాలను సేకరించినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. అయితే దీనిపై తుది నిర్ణయం ఎవరు తీసుకున్నారనే విషయం ఆర్​టీఐ సమాధానంలో చెప్పలేదని సర్దా తెలిపారు.

ఇదీ చదవండి-

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.