ETV Bharat / bharat

అప్పుడే ఇతర వర్గాలకు టీకా: గులేరియా - covid-19 vaccine

దేశంలో కొవిడ్ మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న వేళ.. 45 ఏళ్ల పైబడిన వారితో పాటు చిన్నవయసు వారికీ వ్యాక్సిన్ అందించాల్సిఉందని అభిప్రాయపడ్డారు ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా. అయితే ఇందులో టీకా లభ్యత కీలకం కానుందన్నారు.

vaccine drive should be opened up for people with lower age group
అప్పుడే ఇతర వర్గాలకు టీకా: గులేరియా
author img

By

Published : Apr 4, 2021, 6:25 AM IST

Updated : Apr 4, 2021, 6:55 AM IST

దేశంలో కరోనా కోరలు చాస్తున్న వేళ.. మరిన్ని సమూహాలకు టీకాలు వేయాల్సి ఉందని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా అన్నారు. జనవరి 16న ప్రారంభమైన టీకా కార్యక్రమం కింద ఏప్రిల్ ఒకటి నుంచి 45 ఏళ్లు పైబడిన వారికి టీకాలు ఇస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇంకా చిన్నవయసు వారిని దీని కిందికి తీసుకురావాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే, ఆ విషయంలో టీకా లభ్యత కీలకాంశం కానుందని వెల్లడించారు.

"మనది జనాభా పరంగా పెద్ద దేశం. వయోజనులందరికీ అంటే.. సుమారు 100 కోట్ల మందికి టీకాలు వేయాల్సి ఉంటుంది. అందుకోసం 200 కోట్ల టీకా డోసులు అవసరం. కాకపోతే అన్ని టీకా డోసులను పొందే అవకాశం లేదు. అందుకే టీకా సమతుల్యతను పాటిస్తూ.. ప్రాధాన్య వర్గాలకు టీకాలు అందించాల్సిన అవసరం ఉంది."

-- రణ్‌దీప్ గులేరియా, ఎయిమ్స్ డైరెక్టర్

టీకా కార్యక్రమంలో ఆశించినంత వేగం కనిపించడం లేదని ప్రశ్నించగా.. దిల్లీ ఎయిమ్స్ ఐదు టీకా కేంద్రాలను ఏర్పాటు చేసిందని, నిత్యం 600 మంది టీకాలు వేయించుకుంటున్నారని తెలిపారు. గురువారం 996 మందికి టీకాలు వేసామని, త్వరలోనే 1,000 మార్కును దాటుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకవేళ పదిరోజుల తరవాత వచ్చే వారి సంఖ్య 50 శాతానికి తగ్గిపోతే, ప్రస్తుత ప్రాధాన్య వర్గాల విషయంలో మనం ఆశించిన స్థాయికి చేరినట్లేనని ఆయన వెల్లడించారు. అప్పుడు ఇంతకంటే చిన్నవయసు వారిని టీకా కార్యక్రమంలో చేర్చవచ్చని తెలిపారు.

ప్రస్తుతం మూడు దశల్లో భాగంగా నడుస్తోన్న కరోనా టీకా కార్యక్రమం కింద కేంద్రం ఏడు కోట్లకు పైగా టీకా డోసులను పంపిణీ చేసింది.

ఇదీ చదవండి : అరుదైన వ్యాధులపై జాతీయ విధానం ఆవిష్కరణ

Last Updated : Apr 4, 2021, 6:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.