ETV Bharat / bharat

'మూడు రోజుల్లో కరోనా టీకాలు ఖాళీ' - మహారాష్ట్రలో టీకా పంపిణీ

మహారాష్ట్రలో టీకా పంపిణీ విస్తృతం చేయాలంటే వారానికి 40 లక్షల డోసులు అవసరం అని తెలిపారు ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి. ప్రస్తుతం ఉన్న డోసులు మూడు రోజులకే సరిపోతాయని పేర్కొన్నారు. 20-40 ఏళ్ల మధ్య వయసు వారికి కూడా టీకా అందించేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు.

maharashtra health minister, మహారాష్ట్రలో కరోనా
మహారాష్ట్ర మంత్రి రాజేశ్​ తోపే
author img

By

Published : Apr 7, 2021, 3:38 PM IST

మహారాష్ట్రలో కరోనా వ్యాక్సిన్ కొరత నేపథ్యంలో వారానికి 40 లక్షల డోసుల చొప్పున టీకాలను పంపిణీ చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్​ తోపే. ప్రస్తుతం రాష్ట్రంలో అందుబాటులో ఉన్న 14 లక్షల డోసులు మూడు రోజులకే సరిపోతాయని పేర్కొన్నారు. టీకాలను మరింత వేగంగా అందించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.

"ఎన్నో పంపిణీ కేంద్రాల్లో టీకా కొరత ఏర్పడింది. పలు చోట్ల డోసులు లేక ప్రజలను వెనక్కి పంపించాం. ఇదివరకు రాష్ట్రంలో రోజుకు నాలుగు లక్షల మందికి మాత్రమే టీకాలు అందిస్తే... కేంద్రం సూచనల మేరకు పంపిణీని విస్తృతం చేశాం. ఇప్పుడు ఐదు లక్షల మందికి టీకా ఇస్తున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో మాకు వారానికి 40 లక్షల డోసులు అవసరం. పుణె, ముంబయి, నాశిక్​లలో కొవిడ్​ చికిత్సా కేంద్రాల్లో పడకలు పెంచేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నాం."

-రాజేశ్​ తోపే, మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి

అనుమతి ఇవ్వండి..

20-40 ఏళ్ల మధ్య వారికి కూడా టీకా పంపిణీ చేపట్టేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు మంత్రి. రాష్ట్రంలో వైరస్​ విజృంభణకు కారణం కొత్త వేరియంట్​ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నట్లు తెలిపారు. ఒకవేళ వ్యాప్తికి కారణం కొత్త వేరియంట్​ అయితే.. అందుకు సంబంధించిన చికిత్సపై రాష్ట్రాలకు కేంద్రం సూచనలు ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి : 'హైకోర్టు జడ్జీలుగా మహిళలను నియమించాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.