ETV Bharat / bharat

'మే 1 నుంచి వారికి వ్యాక్సినేషన్​ కష్టమే' - పంజాబ్ లో టీకా పంపిణీ ఆలస్యం

18ఏళ్ల వయసు పైడిన వారికి కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆలస్యం అవునుందని అభిప్రాయపడ్డారు పంజాబ్​ ఆరోగ్య మంత్రి బల్బీర్ సింగ్ సిద్ధూ అన్నారు. రాష్టంలో టీకా డోసుల కొరతే ఇందుకు కారణమని తెలిపారు.

Vaccination
వాక్సినేషన్3.0
author img

By

Published : Apr 29, 2021, 9:58 PM IST

మే1 నుంచి 18ఏళ్లు పైబడిన వారందరకీ కరోనా టీకా పంపిణీ ప్రక్రియ పంజాబ్​లో ఆలస్యం అవునుందని ఆందోళన వ్యక్తం చేశారు ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి బల్బీర్ సింగ్ సిద్ధూ. రాష్ట్రంలో సరిపడా కరోనా టీకాలు లేకపోవడమే ఇందుకు కారణమని తెలిపారు.

"18-45 ఏళ్ల వయసు వారికి టీకాలు వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సీరం ఇన్​స్టిట్యూట్​ ఆఫ్ ఇండియాకు 30 లక్షల కోవిషీల్డ్ డోసుల కోసం ఆర్డర్ ఇచ్చింది. బుధవారం, మాకు రెండు లక్షల మోతాదులు వచ్చాయి. ఆ రోజుకు ముందు 1.50 లక్షల టీకా డోసులు వచ్చాయి. కానీ గురువారం, శుక్రవారం ఎన్ని వస్తాయో మాకు తెలియదు. కనీసం 10 లక్షల మోతాదులు వస్తే, ఈ కార్యక్రమం సాగుతుంది. "

-బల్బీర్ సింగ్ సిద్ధూ, పంజాబ్ ఆరోగ్యమంత్రి

45 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ పంపిణీలోనూ టీకాల కొరత ఉందని కేంద్రానికి ఫిర్యాదు చేసింది పంజాబ్​. రాష్ట్రానికి వారానికి 15 లక్షల మోతాదులను ఇవ్వాలని కేంద్రాన్ని అప్పట్లో కోరింది. టీకాల కొరత కారణంగా, రాష్ట్ర ప్రభుత్వం అనేక కేంద్రాల్లో వ్యాక్సినేషన్​ను నిలిపివేసింది. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత కూడా ఉన్నట్లు ఆరోగ్య మంత్రి గురువారం చెప్పారు. రోజుకు 300 మెట్రిక్ టన్నులు అవసరం ఉండగా కేంద్రం 105 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్​ను మాత్రమే పంపించిందని అన్నారు. అయితే ఇతర చోట్ల నుంచి మరో 36 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్​ను తెచ్చుకున్నామని తెలిపారు.

ఇదీ చదవండి: ఎగ్జిట్​ పోల్స్​: బంగాల్​, అసోంలో భాజపాకు పట్టం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.