దేశంలో వ్యాక్సినేషన్‌కు సంబంధించిన గణాంకాలను కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 60 ఏళ్ల పైబడిన వారిలో 39.9 శాతం మందికి టీకాలు ఇచ్చినట్లు తెలిపింది. 45-60 ఏళ్ల మధ్య వారిలో 45.5 శాతం మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు వివరించింది.
- 30-45 ఏళ్ల వారిలో 9.4 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తి
- 18-30 ఏళ్ల వారిలో 5.2 శాతం మందికి టీకాలు
- 18-44 ఏళ్ల వారిలో 42 లక్షల మందికిపైగా టీకాలు
- గత 24 గంటల్లో 18-44 ఏళ్ల వారిలో 3.28 లక్షలమందికి టీకాలు
- 18-44 ఏళ్ల వారిలో అత్యధికంగా దిల్లీలో 5.26 లక్షల మందికి టీకాలు
- బిహార్‌లో 18-44 ఏళ్ల వారిలో 5.08 లక్షలమందికి టీకాలు
- తెలంగాణలో 18-44 ఏళ్ల వారిలో 500 మందికి టీకాలు
- ఆంధ్రప్రదేశ్‌లో 18-44 ఏళ్ల వారిలో 2,624 మందికి టీకాలు
- ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు 74,28,976 మందికి టీకాలు
- 10 రాష్ట్రాల్లో 67 శాతం మందికి టీకాలు ఇచ్చినట్లు కేంద్రం వెల్లడి