Five Star Hotel rape: ఉత్తరాఖండ్ దెహ్రాదూన్‌లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో దారుణం చోటుచేసుకుంది. 15ఏళ్ల బాలుడు హోటల్లో పనిచేసే 24ఏళ్ల మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. టాయిలెట్లోకి చొరబడి ఆమెపై దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటనపై బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
బంగాల్‌కు చెందిన బాధితురాలు దెహ్రాదూన్‌లో పనిచేస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన నిందితుడు.. తన కుటుంబ సభ్యులతో కలిసి హోటల్లో రెండ్రోజుల క్రితం దిగాడు. మహిళ టాయిలెట్‌కు వెళ్లిన సమయంలో నిందితుడు ఆమెను వెంబడించాడు. లోపలికి వెళ్లి మాట్లాడేందుకు ప్రయత్నించాడు. అప్పుడు మహిళ అతడిని నిలువరించింది. లేడీస్ టాయిలెట్లోకి రాకూడదని వారించింది. అయినా నిందితుడు వినలేదు. తలుపు గడియ పెట్టి.. మహిళపై అత్యాచారం చేశాడు. బాధితురాలు గట్టిగా అరిచినా.. బయటకు శబ్దం వినిపించకపోవడం వల్ల ఎవరూ రాలేదు. దీంతో నిందితుడు ఆమెపై దారుణానికి ఒడిగట్టి పారిపోయాడు.
Dehradun hotel rape:
ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మహిళను వైద్య పరీక్షలకు తీసుకెళ్లారు. ఆమెపై అత్యాచారం జరిగినట్లు వైద్యుల నివేదికలో తేలింది. దీంతో బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని జువెనైల్ జస్టిస్ బోర్డ్ ముందు ప్రవేశపెట్టనున్నట్లు పోలీసులు తెలిపారు.
Delhi rape news:
దిల్లీలోని కీర్తి నగర్లో 25 ఏళ్ల మహిళ అత్యాచారానికి గురైంది. ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నిందితుడు ఉద్యోగం ఇస్తానని ఆశచూపి మహిళపై గురువారం అత్యాచారానికి పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని బాబా హరిదాస్ నగర్‌కు చెందిన శుభమ్‌గా గుర్తించారు. అతడిని జ్యుడిషియల్ కస్టడీకి తరలించినట్లు తెలిపారు.
ఇదీ చదవండి: