ETV Bharat / bharat

అత్యాచారానికి యత్నించి.. కత్తితో ముఖంపై పొడిచి... - ఉత్తర్​ప్రదేశ్​ లైంగిక వేధింపుల వార్త

లైంగిక వేధింపులను ప్రతిఘటించిన బాలిక(15)పై ఓ యువకుడు(23) పైశాచికత్వం ప్రదర్శించాడు. కత్తితో ఆమె ముఖంపై దాడి చేశాడు.ఉత్తర్​ప్రదేశ్​లో జరిగిందీ దారుణం.

molestation
లైంగిక వేధింపులు
author img

By

Published : Jul 13, 2021, 1:40 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ బాలిక ముఖంపై 23 ఏళ్ల యువకుడు తీవ్రంగా దాడి చేశాడు. లైంగిక వేధింపులను ప్రతిఘటించిన కారణంగానే యువకుడు ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.

'బలియా జిల్లాలోని బన్సిదిహ్​ రోడ్డు ప్రాంతంలో నివసిస్తున్న బాలిక ఇంట్లోకి పొరుగింటి యువకుడు ప్రవేశించాడు. లైంగికంగా వేధించడానికి ప్రయత్నించాడు. బాలిక ప్రతిఘటించగా.. యువకుడు ఆమె చేతులను తాడుతో కట్టేశాడు. అనంతరం కత్తితో ఆమె ముఖంపై దాడి చేశాడు. దీంతో బాలిక ముఖంపై లోతైన గాట్లు పడ్డాయి. బాలికను కుటుంబ సభ్యులు వారణాసికి తరలించారు.' అని జిల్లా ఎస్పీ సంజయ్​ యాదవ్​ తెలిపారు.

బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడ్ని అరెస్టు చేశారు.

ఇవీ చదవండి: అన్న ప్రేమపై తమ్ముడి ఆగ్రహం- ఆమెపై కిరోసిన్​ పోసి..

జనరేటర్​ పేలి.. ఒకే కుటుంబంలో ఆరుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.