ETV Bharat / bharat

'తొమ్మిదేళ్లుగా అఫైర్​.. పెళ్లి చేసుకోమంటే మతమార్పిడికి బలవంతం' - ప్రేమ పేరుతో మోసం

ఓ యువతిని ప్రేమ పేరుతో మోసగించాడు ఓ వ్యక్తి. పెళ్లి ప్రస్తావన తీసుకువస్తే మతం మార్చుకోవాలని బలవంతం చేశాడు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని పీలీభీత్​ జిల్లాలో జరిగింది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్​ చేశారు.

uttarpradesh news latest
యువతిని ట్రాప్​ చేసి తొమ్మిదేళ్లగా అఫైర్​.. పెళ్లిచేసుకోమంటే..
author img

By

Published : Nov 10, 2021, 1:24 PM IST

ఓ యువతిని ప్రేమ పేరుతో ట్రాప్​ చేసి తొమ్మిదేళ్లుగా ఆమెతో శారీరక సంబంధం కొనసాగించాడు ఓ వ్యక్తి. తీరా పెళ్లి విషయం ప్రస్తావించే సరికి మతం మార్చుకోమని బలవంతం చేశాడు. బాధితురాలికి తెలియకుండా ఆమె ఆధార్​ కార్డులో పేరు కూడా మార్చేశాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని పీలీభీత్​ జిల్లా రుద్రపుర్​లో జరిగింది.

పోలీసుల వివరాల ప్రకారం..

తొమ్మిదేళ్ల క్రితం మహారాష్ట్రకు చెందిన బాధితురాలు ఉత్తర్​ప్రదేశ్​లోని రుద్రపుర్​కు వలసవచ్చింది. అదే సమయంలో ఆమెకు నిందితుడు సల్మాన్​తో పరిచయం ఏర్పడింది. ప్రేమ పేరుతో సల్మాన్​ ఆమెతో ఇన్నాళ్లూ శారీరక సంబంధం కొనసాగించాడు. వారికి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. పెళ్లి ప్రస్తావన తెచ్చేసరికి బాధితురాలిని మతం మార్చుకోవాలని నిందితుడు సహా అతని కుటుంబసభ్యులు బలవంతం చేశారు.

మతం మార్చుకోకుంటే తనను భార్యగా అంగీకరించనని, పిల్లలతో కూడా తనకు ఇక మీదట ఎలాంటి సంబంధం ఉండదని నిందితుడు చెప్పినట్లు బాధితురాలు వాపోయింది.

మరో యువతిని కూడా..

నిందితుడు మరో యువతిని కూడా ప్రేమ పేరుతో ట్రాప్​ చేశాడని బాధితురాలు ఆరోపించింది. దీపావళికి ముందు.. బాణసంచా దుకాణం పెడతానని తన వద్ద నుంచి లక్ష రూపాయలు కూడా తీసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్​ చేశారు.

ఇదీ చూడండి : 66 కిలోల డ్రగ్స్ సీజ్.. విలువ రూ.350 కోట్లకు పైనే...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.