ETV Bharat / bharat

ఆ గ్రామంలో ఇళ్లన్నీ అమ్మకానికే! - గ్రామం

ఉత్తర్​ప్రదేశ్​ హాపుడ్​ జిల్లా నగర పంచాయతీలోని ఆదర్శ్​నగర కాలనీ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. ఎటు చూసినా మురికి గుంటలే. డ్రైనేజి లేక మురుగునీరుని బకెట్లతో తీసుకుపోయే దృశ్యాలు కనిపిస్తాయి. అధికారులకు ఎంత చెప్పినా పట్టించుకోకపోవడం వల్ల విసుగు చెందిన కాలనీవాసులు తమ ఇళ్లను అమ్ముకోవడానికి సిద్దమయ్యారు.

house for sale board on all houses in village
ఇల్లు అమ్మబడును
author img

By

Published : Jun 10, 2021, 6:31 AM IST

Updated : Jun 10, 2021, 7:49 AM IST

ప్రతి ఇంటిపై హౌస్​ ఫర్​ సేల్​ బోర్టు

ఉత్తర్​ప్రదేశ్​ హాపుడ్​​​లోని ఆదర్శ్​నగర్​ కాలనీకి గత మూడేళ్ల నుంచి రోడ్లు, డ్రైనేజీ సదుపాయం లేదు. ఎక్కడో పైపులైను పాడై.. సరిగ్గా తాగు నీరు కూడా రావటం లేదు. ఎన్నోసార్లు అధికారులకు మొర పెట్టుకున్నారు. కానీ వాళ్లు కనికరించలేదు. చివరి ప్రయత్నంగా ఇదిగో ఇలా "ఇల్లు అమ్ముతాం ఎవరైనా కొనండి, ఇక్కడ ఉండలేకపోతున్నాం," అని ఇంటి మీద రాసుకున్నారు.

"మా గ్రామం ఇంత వరకు అభివృద్ధి చెందలేదు. ఈ కాలనీకి రోడ్డు సదుపాయం లేదు. తాగునీటి వసతి లేదు. డ్రైనేజీ వ్యవస్థ కూడా లేదు. మా కాలనీలో పరిస్థితి ఇదీ.. పరిష్కరించడని ఎన్నోసార్లు నగరపంచాయతీకి విన్నవించాం, ధర్నాలు చేశాం. అయినా వారు పట్టించుకోలేదు. మా కాలనీలో సమస్యల్ని పరిష్కరించకుంటే..ఇళ్లు అమ్ముకుని ఎక్కడికైనా వెళ్లిపోతాం."

-రాముల్​ సింగ్, హాపుడ్​, ఆదర్శ్​నగర్​ కాలనీవాసి ​

"వర్షంపడితే ఇక్కడంతా బురద పేరుకుపోతుంది. ఇంటి ముందు మురునీరు చేరి పరిస్థితి దారుణంగా ఉంటుంది. అధికారులకు చెప్పినా పట్టించుకోరు. వేరే కాలనీలో రోడ్లు వేస్తారు కానీ ఇక్కడ వేయరు."

-అశోక్​ కుమార్​, హాపుడ్​ ఆదర్శ్​నగర్​ కాలనీవాసి

ఈ విషయం తెలుసుకున్న నగరపంచాయతీ అధికారులు దిగివచ్చారు. ఊరంతా సర్వేచేసి సమస్యల్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

"హాపుడ్​ నగరపాలికకు వెళ్లాము. ఆ గ్రామంలో తాగునీటి సమస్య, రోడ్ల సమస్య ఉంది. పైపులైను లీకేజీ కారణంగా గ్రామానికి తాగునీరు అందడం లేదు. ప్రజలు సమస్యల్ని మా ముందుకు తెచ్చారు. త్వరలోనే వాటిని పరిష్కరిస్తాం. రోడ్లు వేయడం కోసం సర్వే చేస్తున్నాం. మరి కొన్ని రోజుల్లో వారి సమస్యల్ని తీర్చుతాం."

-సత్యప్రకాశ్​, సబ్​ డివిజనల్​ మెజిస్ట్రేట్​, హాపుడ్​​

ఇదీ చదవండి: 'కరోనాపై 'సర్జికల్ స్ట్రైక్' చేయండి'

Last Updated : Jun 10, 2021, 7:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.