ETV Bharat / bharat

చిన్నారిని కిడ్నాప్ చేసి.. నోట్లో తుపాకీ పెట్టి..!

నాలుగేళ్ల బాలుడిని అపహరించి (child bullying) కొట్టడమే గాక.. నోటిలో తుపాకీ పెట్టి బెదిరించాడో వ్యక్తి. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

Put gun in child mouth in Moradabad
చిన్నారిపై బెదిరింపు
author img

By

Published : Nov 21, 2021, 4:47 PM IST

చిన్నారి కిడ్నాప్

ఓ చిన్నారి పట్ల అమానుషంగా (child bullying) ప్రవర్తించాడో వ్యక్తి. నాలుగేళ్ల బాలుడిని అపహరించి.. నోట్లో తుపాకీ పెట్టి బెదిరించాడు. ఉత్తర్​ప్రదేశ్ మొరాదాబాద్‌ జిల్లా దిలారి ప్రాంతంలోని ఇలార్ అనే గ్రామంలో ఈ ఘటన జరిగింది.

'చిన్నారికి తల్లి లేదని.. ఈ వీడియో తనకు వాట్సాప్‌లో వచ్చిందని' బంధువు విజేంద్ర తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ నిందితునిపై సరైన చర్యలు తీసుకోవట్లేదని ఆరోపించారు. కఠినంగా శిక్షించాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

"గ్రామంలో పలుకుబడి ఉన్న వ్యక్తి బాలుడిని కిడ్నాప్​ చేశాడు. నాలుగేళ్ల చిన్నారిని నోరు తెరవాలని బెదిరించాడు. నోట్లో తుపాకీ పెట్టి, మంచం మీద పడేసి.. కొడుతున్న వీడియో వాట్సాప్​లో వచ్చింది. తల్లి లేని చిన్నారిని హింసించారు. పోలీసులు ఇది చాలా చిన్న కేసు అంటున్నారు. అందుకే ఎస్​పీని కలిసేందుకు వచ్చా. బాలుడిని విడిపించకపోతే డీఐజీ కార్యాలయానికి కూడా వెళ్తా.

--విజేంద్ర, చిన్నారి బంధువు

వీడియోలోని మాటల ఆధారంగా బాలుడిని అపహరించింది అజిత్​ అనే వ్యక్తిగా ఆరోపించారు బాధితుడి బంధువు విజేంద్ర. ఊరిలో పలుకుబడి ఉన్న వ్యక్తి కాబట్టే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని వాపోయారు.

మరోవైపు.. గ్రామానికి చెందిన ఓ యువకుడు చిన్నారితో అసభ్యంగా ప్రవర్తించినట్లు సమాచారం అందిందని సీఐ అనూప్ కుమార్ తెలిపారు. నిందితుడు అజిత్‌ను అరెస్ట్ చేసి జైలుకు తరలించినట్లు వివరించారు.

సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారిన ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారితో అలా ప్రవర్తించడమేంటని మండిపడుతున్నారు.

ఇవీ చదవండి: కూలీ డబ్బులు అడిగినందుకు చేయి నరికేసిన యజమాని

సబ్​ ఇన్​స్పెక్టర్​ దారుణ హత్య- ఆ ముఠా పనే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.