ETV Bharat / bharat

మంత్రిగారూ.. మాస్కు మూతికి పెట్టుకోవాలండీ!

author img

By

Published : Jul 16, 2021, 11:42 AM IST

కరోనా మహమ్మారిని ఎదుర్కోవాలంటే నిబంధనలు పాటించడమే మేలని అందరికీ తెలుసు. అయితే.. నలుగురికీ ఆదర్శంగా నిలవాల్సిన మంత్రిగారే కొవిడ్ నిబంధనలు మరిచారు. అంతేకాదు.. ఏకంగా తన కాలి బొటనవేలికి మాస్కు ధరించి దర్జాగా సమావేశంలో కూర్చున్నారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

MINISTER MASK
మంత్రిగారూ..మాస్కు మూతికి పెట్టుకోవాలండీ!

కరోనా మూడో దశ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కు తప్పనిసరిగా ధరించాలంటూ ఆరోగ్య నిపుణులు పదే పదే చెబుతున్నారు. కానీ, చాలా మంది ఆ మాటలను పెడచెవిన పెడుతున్నారు. సాధారణ ప్రజలైతే సరేసరి.. పదిమందికీ చెప్పాల్సిన మంత్రుల స్థాయిలో ఉన్న వ్యక్తులే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మాస్కులు పెట్టుకోకుండా సమావేశాలకు హాజరవుతున్నారు. ఓ మంత్రి అయితే మాస్కును ఏకంగా కాలి బొటనవేలికి తగిలించి మీటింగ్‌లో పాల్గొనడం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

MINISTER
మాస్కును కాలి బొటన వేలికి తగిలించిన మంత్రి

ఉత్తరాఖండ్‌లో భాజపాకు చెందిన ఐదుగురు నేతలు ఓ సమావేశం ఏర్పాటు చేశారు. అందులో ముగ్గురు మంత్రులు కూడా ఉన్నారు. ఏ ఒక్కరికీ మాస్కులు లేవు. మంత్రి యతీశ్వరానంద్‌ మాస్కును ఏకంగా కాలి బొటన వేలికి తగిలించి సమావేశంలో పాల్గొనడం చర్చనీయాంశమైంది. ఈ ఫొటోను ఉత్తరాఖండ్‌ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి గరిమా దాసౌని ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

"ఇదీ అధికార భాజపా మంత్రుల పరిస్థితి. వీరంతా మాస్కులు పెట్టుకోని వారిని శిక్షించమని చెబుతారు." అంటూ విమర్శించారు. మాస్కు పెట్టుకోవడానికి ఏది సరైన చోటో ఉత్తరాఖండ్‌ మంత్రిని అడిగి తెలుసుకోండి అంటూ ఆప్‌నేత దీప్‌ ప్రకాశ్‌ పంత్‌ కామెంట్‌ చేశారు. దీనిపై ప్రస్తుతం విపక్షాల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.