ETV Bharat / bharat

దుకాణాలపై విరిగిపడ్డ కొండచరియలు.. 13 మంది గల్లంతు.. ఒకే కుటుంబంలో ఏడుగురు.. - ఉత్తరాఖండ్‌లో కొండచరియలు విరిగిపడి దుకాణాలు ధ్వసం

Uttarakhand Landslide : ఉత్తరాఖండ్​లో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో మూడు దుకాణాలు ధ్వంసమయ్యాయి. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురితో పాటు మొత్తం 13 మంది గల్లంతయ్యారు. గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది.

Uttarakhand -landslide-shops-damaged-and-several-people-trapped-under-debris
ఉత్తరాఖండ్​లో విరిగిపడ్డ కొండచరియలు
author img

By

Published : Aug 4, 2023, 9:47 AM IST

Updated : Aug 4, 2023, 10:55 AM IST

Uttarakhand Landslide : ఉత్తరాఖండ్​లో విపరీతంగా కురుస్తున్న వర్షాల కారణంగా రుద్రప్రయాగ్​​ జిల్లాలోని కేదార్‌నాథ్ ధామ్ వద్ద భారీగా కొండచరియలు విరిగిపడి 13 మంది గల్లంతయ్యారు. కేదార్‌నాథ్ ఆలయానికి వెళ్లే మార్గంలో కీలకమైన గౌరీకుండ్‌లో ఈ ఘటన జరిగింది. అకస్మాత్తుగా విరిగిపడ్డ కొండచరియలు.. స్థానికంగా ఉన్న మూడు దుకాణాలు ధ్వంసమయ్యాయి. దీంతో అందులో నిద్రిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురితో పాటు మొత్తం 13 మంది గల్లంతయ్యారు. గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది.

ప్రమాదంపై సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. అయితే, భారీగా వర్షాలు కురుస్తున్న కారణంగా సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడుతోంది. బాధితులు బతికేందుకు అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. బాధితుల్లో చాలా మంది నేపాల్​ మూలాలున్నవారు ఉన్నారని స్థానికులు తెలిపారు. వీరంతా ఇక్కడ దుకాణాలు ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందుతున్నారని వెల్లడించారు. గురువారం రాత్రి నుంచి సహాయక చర్యలు జరుగుతున్నా ఎలాంటి ఫలితం లేదని వారు వాపోయారు. బాధితులు మందాకిని నదిలో కొట్టుకుపోయి ఉంటారని అధికారులు భావిస్తున్నారు.

ఉత్తరాఖండ్​లో కొండచరియలు విరిగిపడి పలువురు గల్లంతు

ఒకే కుటుంబంలో ఏడుగురు గల్లంతు..
గల్లంతైన వారిలో అమర్ బోహ్రా.. అతని భార్య అనితా బోహ్రా, వారి కుమార్తెలు రాధిక బోహ్రా, పింకీ బోహ్రాగా, కుమారులు పృథ్వీ బోహ్రా (7), జటిల్ (6), వకీల్ (3) ఉన్నారని అధికారులు తెలిపారు. వీరితో పాటు వినోద్ (26), ములాయం (25), అషు (23), ప్రియాంషు చమోలా (18), రణబీర్ సింగ్ (28) ఉన్నారని వారు వెల్లడించారు.

uttarakhand-kedarnath-landslide-shops-damaged-and-several-people-trapped-under-debris

కొండచరియలు విరిగిపడి 27 మంది బలి.. ధ్వంసమైన 17 ఇళ్లు..
Maharashtra Landslide Incident : రెండు వారాల క్రితం మహారాష్ట్రలో కొండచరియలు విరిగిపడిన విషాద ఘటనలో దాదాపు 27 మంది మరణించారు. రాయ్‌గఢ్‌ జిల్లాలో కొండ ప్రాంతమైన ఇర్షల్‌వాడీలో కొండచరియలు విరిగిపడటం వల్ల పెను విషాదం నెలకొంది. ఈ ఘటనలో భారీగా ప్రాణనష్టం సంభవించగా గల్లంతయ్యారు. వారి కోసం NDRF, ఇతర సహాయక బృందాలు ముమ్మరంగా గాలించాయి. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Last Updated : Aug 4, 2023, 10:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.