ఉత్తరాఖండ్లో వరద సహాయక చర్యలు ఆరో రోజూ కొనసాగుతున్నాయి. గురువారం రిషిగంగా నది నీటిమట్టం ఒక్కసారిగా పెరిగి, తపోవన్ సొరంగం వద్ద నిలిచిన సహాయక చర్యలు ఈ ఉదయం తిరిగి ప్రారంభమయ్యాయి.
చమోలీ జిల్లాలో ఆకస్మిక వరదల వల్ల ఇప్పటివరకు 36 మంది మరణించినట్లు అధికారులు ధ్రువీకరించారు. ఇద్దరు సజీవంగా బయటపడగా.. 204 మంది ఆచూకీ తెలియాల్సి ఉందని చెప్పారు.
![Uttarakhand glacier burst: Rescue operations continue for sixth day at Tapovan tunnel](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10593453_3.jpg)
![Uttarakhand glacier burst: Rescue operations continue for sixth day at Tapovan tunnel](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10593453_4.jpg)
![Uttarakhand glacier burst: Rescue operations continue for sixth day at Tapovan tunnel](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10593453_1.jpg)
రిషిగంగా నీటిమట్టం క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో.. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసినట్టు చమోలీ పోలీసులు తెలిపారు. భయపడకుండా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
గల్లంతైన వారికోసం తీవ్రంగా గాలిస్తున్నాం. నదితీరం వెంబడి మృతదేహాలను వెతకడానికి ఒక బృందాన్ని నియమించాం. సహాయక చర్యల్లో పాల్గొంటున్న ఏజెన్సీలు 24గంటలూ కష్టపడుతున్నాయి.
-పీకే తివారీ, ఎన్డీఆర్ఎఫ్ కమాండెంట్
ఇదీ చదవండి: ఉత్తరాఖండ్లో మళ్లీ ఉప్పొంగిన నది