ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలోని జోషిమఠ్ వద్ద మంచు చరియలు విరిగిపడి పెను ప్రమాదానికి దారి తీసిన ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమీక్షించారు. అసోం పర్యటనలో ఉన్న ప్రధాని.. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్, ఇతర ఉన్నతాధికారులతో మాట్లాడారు. విపత్తు గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సహాయ చర్యలు సాగుతున్న తీరుపై ఆరా తీశారు.
షా సమీక్ష..
ఉత్తరాఖండ్ ప్రమాదంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రావత్, ఐటీబీపీ, ఎన్డీఆర్ఎఫ్ డీజీలతో మాట్లాడారు.
-
#WATCH | 3 NDRF teams have reached there. More teams are ready to be airlifted to Uttarakhand from Delhi. ITBP jawans are also there. I assure people of Uttarakhand that Modi govt stands with them in this difficult time. All help will be extended: HM Amit Shah pic.twitter.com/lYxOhr8T2Y
— ANI (@ANI) February 7, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | 3 NDRF teams have reached there. More teams are ready to be airlifted to Uttarakhand from Delhi. ITBP jawans are also there. I assure people of Uttarakhand that Modi govt stands with them in this difficult time. All help will be extended: HM Amit Shah pic.twitter.com/lYxOhr8T2Y
— ANI (@ANI) February 7, 2021#WATCH | 3 NDRF teams have reached there. More teams are ready to be airlifted to Uttarakhand from Delhi. ITBP jawans are also there. I assure people of Uttarakhand that Modi govt stands with them in this difficult time. All help will be extended: HM Amit Shah pic.twitter.com/lYxOhr8T2Y
— ANI (@ANI) February 7, 2021
" ఉత్తరాఖండ్ విపత్తుపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి టీఎస్ రావత్, డీజీలు, ఐటీబీపీ, ఎన్డీఆర్ఎఫ్ అధికారులతో మాట్లాడాను. ప్రమాదంలో చిక్కుకున్న ప్రజలను కాపాడేందుకు సంబంధిత అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెళ్లాయి. అన్ని విధాల అవసరమైన సహాయక చర్యలు చేపడుతున్నాం."
- అమిత్ షా, కేంద్ర హోంమంత్రి
రంగంలోకి వైమానిక దళ హెలికాప్టర్లు
ప్రమాద స్థాయి పెరిగిన క్రమంలో దిల్లీ నుంచి మరిన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందాలను విమానాల్లో ఉత్తరాఖండ్‌కు తరలించినట్లు చెప్పారు అమిత్ షా. పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు తెలిపారు. వైమానిక దళానికి చెందిన రెండు ఎంఐ-17, ఒక ఏఎల్‌హెచ్ ధ్రువ్ హెలికాప్టర్లను డెహ్రాడూన్, పరిసర ప్రాంతాల్లో మెహరించారు అధికారులు. అవసరాన్ని బట్టి మరిన్ని ఎయిర్‌క్రాఫ్ట్‌లను మోహరిస్తామని తెలిపారు.
వరద ప్రభావిత ప్రాంతానికి సుమారు 600 మంది సైనికులను తరలిస్తున్నారు అధికారులు.
ఇదీ చూడండి: ఉత్తరాఖండ్‌లో పెను ప్రమాదం- 150మంది గల్లంతు