ETV Bharat / bharat

Uttarakhand Election 2022: యువోత్సాహమా? అనుభవ దరహాసమా? - harish rawat election

Uttarakhand Election 2022: ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుత సీఎం పుష్కర్​సింగ్ ధామీ, మాజీ సీఎం హరీశ్ రావత్‌ల మధ్య పోటీ ఆసక్తిని పెంచుతోంది. భాజపాకు తిరిగి అధికారాన్ని కట్టబెట్టాలని ధామీ చూస్తుండగా.. అధికార పీఠం కోసం కాంగ్రెస్ తరఫున రావత్ తీవ్రంగా శ్రమిస్తున్నారు.

Uttarakhand Election 2022
ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలు
author img

By

Published : Jan 31, 2022, 7:35 AM IST

Uttarakhand Election 2022: భాజపా, కాంగ్రెస్‌ల మధ్య వంతులవారీగా అధికారం చేతులు మారే రాష్ట్రంగా పేరున్న ఉత్తరాఖండ్‌లో ప్రస్తుతం సీఎం పుష్కర్‌సింగ్‌ ధామీ, మాజీ సీఎం హరీశ్‌ రావత్‌ల మధ్య పోటీ ఆసక్తి రేపుతోంది! వీరిద్దరూ ఏ నియోజకవర్గంలోనూ నేరుగా తలపడటం లేదు. కానీ ఎన్నికల్లో తమ పార్టీలకు విజయం సాధించిపెట్టాల్సిన గురుతర బాధ్యతను భుజాలపై మోస్తున్నారు. సీఎం పీఠమెక్కిన దాదాపు ఆరు నెలలకే ధామీ ఈ ఎన్నికలను ఎదుర్కొంటుండగా.. కాంగ్రెస్‌ తరఫున చావో రేవో తేల్చుకునేందుకు అపార అనుభవశాలి రావత్‌ సిద్ధమయ్యారు.

రావత్‌: ప్రజాదరణలో ముందంజ

2017 అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో దిగిన రెండు స్థానాల్లోనూ హరీశ్‌ రావత్‌ పరాజయం పాలయ్యారు. అయినప్పటికీ రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ కలిగిన రాజకీయ నాయకుల్లో ఒకరిగా ఈయన కొనసాగుతున్నారనడంలో ఎలాంటి సందేహమూ లేదు. 'సీఎంగా ఎవరుంటే బాగుంటుంది' అన్న అంశంపై ఉత్తరాఖండ్‌లో ఇటీవల నిర్వహించిన పలు ఒపీనియన్‌ పోల్స్‌లో ఈయన వైపే అత్యధికులు మొగ్గుచూపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి వచ్చినప్పటికీ భాజపా ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చడంపై ఎన్నికల ప్రచారంలో రావత్‌ ప్రధానంగా విమర్శలు గుప్పిస్తున్నారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పెరుగుదల వంటి సమస్యలను ప్రస్తావిస్తున్నారు.

ప్రభుత్వంపై వ్యతిరేకతను సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలో ఐదేళ్లకోసారి అధికార పార్టీ మారే సంప్రదాయం కూడా ఈ దఫా తమకు అనుకూలంగా ఉండటంతో ఎన్నికల్లో విజయంపై 73 ఏళ్ల రావత్‌ విశ్వాసంతో కనిపిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రచార కమిటీ సారథిగా ఉన్న ఈయన.. లాల్‌కువా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.

ధామీ: చరిత్రను తిరగరాస్తారా?

46 ఏళ్ల ధామీ గత ఏడాది జులైలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అతిపిన్న వయసులో ఉత్తరాఖండ్‌ సీఎం పీఠమెక్కిన రికార్డు ఈయనదే. స్వల్ప పదవీకాలంలో.. చార్‌ధామ్‌ దేవస్థానం బోర్డును రద్దు చేయాలంటూ జరిగిన ఆందోళనలు, కొవిడ్‌ రెండో ఉద్ధృతి, హరిద్వార్‌ కుంభ్‌ నిర్వహణ లోపాలు, భారీ వర్షాల (నవంబరులో) వంటి కఠిన సవాళ్లు ఆయనకు ఎదురయ్యాయి. దేవస్థానం బోర్డును రద్దు చేయడం ద్వారా ఈయన పూజారులను శాంతింపజేశారు.

.
.

ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడంలో గత ప్రభుత్వాలతో పోలిస్తే ధామీ సర్కారు మెరుగ్గా వ్యవహరించిందన్న పేరుంది. తనకంటే సీనియర్లు ఉన్న మంత్రివర్గాన్ని నడిపించడంలోనూ ఆయన విజయవంతమయ్యారు. (హరక్‌సింగ్‌ రావత్‌ ఒక్కరే మినహాయింపు. ధామీ మంత్రివర్గంలో పనిచేసిన ఆయన ఇటీవల కాంగ్రెస్‌లో చేరారు) బహిరంగంగా పలు వేదికల నుంచి ధామీపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రశంసలు కురిపించిన తీరు.. వారి అంచనాలను అందుకోవడంలో ఆయన సఫలమైనట్లు స్పష్టం చేస్తోంది. గత ఐదేళ్లలో తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టులు ఎన్నికల్లో విజయాన్ని కట్టబెడతాయని ధామీ ఆశిస్తున్నారు.

.
.

ఉత్తరాఖండ్‌లో సిట్టింగ్‌ సీఎంలెవరూ తర్వాతి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన దాఖలాలు లేవు. ప్రస్తుతం ఖటీమా స్థానం నుంచి ఎన్నికల బరిలో ఉన్న ఆయన.. సిట్టింగ్‌ ముఖ్యమంత్రుల విషయంలో ఆ చరిత్రను తిరగరాయాలని ఉవ్విళ్లూరుతున్నారు.

ఇవీ చూడండి: ఉత్తరాఖండ్​లో మోదీ ఇమేజ్​ మళ్లీ అధికారాన్ని కట్టబెట్టేనా?

రెండు స్థానాల్లో సీఎం చన్నీ పోటీ.. కెప్టెన్​పై పోటీకి మాజీ మేయర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.