ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఆదివారం మరో 13 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఫలితంగా మొత్తం మృతుల సంఖ్య 51కి చేరింది.
ఆదివారం తపోవన్ సొరంగం వద్ద 6 మృతదేహాలు లభ్యం కాగా.. మరో ఆరు మృతదేహాలు రైనీ గ్రామం వద్ద కనిపించాయి. రుద్రప్రయాగ్ నదీ ఒడ్డున ఒక మృతదేహం కనిపించింది.
ఆచూకీ గల్లంతైన వారిని రక్షించే చర్యల్లో భాగంగా తపోవన్ సొరంగానికి రంధ్రం చేశారు అధికారులు. బురదతో నిండిపోయిన సొరంగంలో 30 మందికిపైగా చిక్కుకుని ఉంటారని రెస్క్యూ బృందాలు భావిస్తున్నాయి.
ఇదీ చదవండి:ఆపరేషన్ తపోవన్: సొరంగానికి రంధ్రం