ఉత్తర్‌ప్రదేశ్ బులంద్‌శహర్ జిల్లాలో(Uttar Pradesh Bulandshahr News) దారుణం జరిగింది. మైనర్ల మధ్య తలెత్తిన గొడవ రక్తపాతానికి దారి తీసింది. ముగ్గురు వ్యక్తులు కలిసి ఓ బాలుడి నాలుకను కత్తెరతో గుచ్చారు.
అసలేమైంది?
బులంద్‌శహర్ జిల్లా(Uttar Pradesh Bulandshahr News) బరౌలీ గ్రామంలో.. ఇద్దరు మైనర్ల మధ్య ఏదో విషయంలో గొడవ తలెత్తింది. దాంతో వారిలో ఓ బాలుడి కుటుంబ సభ్యులు ముగ్గురు క్రూరంగా ప్రవర్తించారు. ఇంకో బాలుడి నాలుకను కత్తెరతో గుచ్చారు. ఈ క్రమంలో మరో బాలుడి తలకు కూడా గాయాలయ్యాయి.
బాలుడిపై కత్తెరతో దాడి తర్వాత అతడి గొంతు నుంచి, నోటి నుంచి తీవ్రంగా రక్తస్రావమైనట్లు పోలీసులు తెలిపారు. ఆ సమయంలో అతడ్ని ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు ఎవరూ లేరని చెప్పారు. అయితే.. అతడే ఏదోలా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని, జరిగిన విషయాన్ని తమకు తెలియజేశాడని పోలీసులు వెల్లడించారు.
తీవ్ర రక్తస్రావమైన బాధిత బాలుడి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. అతడు స్పష్టంగా మాట్లాడలేకపోతున్నాడని చెప్పారు. దీనిపై ఐపీసీలోని సెక్షన్ 324 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల్లో ఒకరిని అరెస్టు చేసి, జైలుకు తరలించారు. మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నారు.
ఇదీ చూడండి: మాస్క్ లేదని ఫైన్.. అధికారుల్ని చితకబాదిన స్థానికులు
ఇదీ చూడండి: విమానం సీటు కింద దాచి బంగారం స్మగ్లింగ్.. చివరకు...