ఉత్తర్‌ప్రదేశ్ సచివాలయంలో విధులు నిర్వహించే అధికారులు, సిబ్బందిపై పలు ఆంక్షలు విధించింది ప్రభుత్వం. సచివాలయంలో ఇక మీదట జీన్స్, టీ షర్ట్స్ ధరించడాన్ని నిషేధిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు సచివాలయం జాయింట్ సెక్రటరీ నరేంద్ర కుమార్ మిశ్రా ఆదేశాలు జారీ చేశారు. గౌరవప్రదమైన దుస్తుల్లోనే వారు కార్యాలయానికి రావాలని ఆదేశాలు జారీ చేశారు.
అసెంబ్లీకి కొన్ని సంప్రదాయాలు ఉన్నాయని మిశ్రా జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో విధులు నిర్వహించే భద్రతా సిబ్బంది, ఇతర అధికారులకు డ్రెస్‌కోడ్ ఉందని తెలిపారు. ఈ మేరకు సచివాలయం ఉద్యోగులు కూడా అదే పద్ధతిలో గౌరవప్రదమైన దుస్తులు ధరించాలని ఆదేశించారు.
దాదాపు 400 మంది ఉద్యోగులు ఉత్తర్‌ప్రదేశ్ సచివాలయంలో విధులు నిర్వహిస్తున్నారు.
ఇదీ చదవండి:ప్రభుత్వ ఉద్యోగులు జీన్స్, టీ షర్ట్స్ ధరించటం నిషేధం!