ETV Bharat / bharat

యోగి సర్కార్ కీలక నిర్ణయం.. విద్యుత్ రేట్లలో 50 శాతం కోత!

Uttar Pradesh electricity rate cuts: ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉత్తర్​ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బోరు బావులు వినియోగించే రైతులకు ఉపశమనం కలిగించేలా.. విద్యుత్ రేట్లను తగ్గించింది. అన్ని రకాల రేట్లను 50 శాతం తగ్గించింది.

Uttar Pradesh govt slashes electricity rates

author img

By

Published : Jan 8, 2022, 9:50 PM IST

Uttar Pradesh electricity rate cuts: అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉత్తర్​ప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ రేట్లలో కోత విధించింది. రైతులకు ప్రయోజనం కలిగేలా బోరు బావుల విద్యుత్ ధరలను తగ్గించింది. పట్టణాల్లో మీటరు ఉన్న బోరుబావుల కనెక్షన్ల యూనిట్ ధరను రూ.6 నుంచి రూ.3కు.. గ్రామీణ మీటర్ల పంప్ కనెక్షన్ల యూనిట్ ధరను రూ.2 నుంచి రూ.1కి పరిమితం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

UP Electricity bills

పట్టణాల్లో ఫిక్స్​డ్ ఛార్జీల రేటు హార్స్​పవర్​కు రూ.130 నుంచి రూ.65కు... గ్రామాల్లో రూ.70 నుంచి రూ.35కు తగ్గించింది. మీటర్లు లేని కనెక్షన్లకు రేటును హార్స్​పవర్​కు రూ.170 నుంచి రూ.85కు పరిమితం చేసింది.

Yogi Adityanath news

'రైతులు ఆనందంగా ఉంటేనే ఉత్తర్​ప్రదేశ్ స్వయం సమృద్ధి సాధ్యమవుతుంది. అందుకే రైతులకు ప్రయోజనాలు కలిగే విధంగా 50 శాతం రేట్ల తగ్గింపు నిర్ణయం తీసుకున్నాం' అంటూ యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ట్వీట్ చేశారు. యోగి సర్కార్ నిర్ణయం వల్ల యూపీ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్​పై రూ.వెయ్యి కోట్ల అదనపు భారం పడనుంది.

ఏడు విడతల్లో

దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీకి ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఈసీ శనివారం షెడ్యూల్ విడుదల చేసింది. ఫిబ్రవరి 10న తొలి దశ పోలింగ్ ప్రారంభం కానుంది. ఈ ఎన్నికలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఈ లింక్​పై క్లిక్ చేయండి.

ఇదీ చదవండి: ఈసీ ఎన్నికల షెడ్యూల్​పై ఏ పార్టీలు ఏమన్నాయంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.