ఎన్నికలు సమీపిస్తున్న వేళ నాయకత్వ మార్పుపై ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ఉత్తర్ప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ దిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. ఇప్పటికే కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో గురువారం భేటీ అయిన ఆదిత్యనాథ్.. నేడు మోదీతో సమావేశం కానున్నారు. ప్రధానితో పాటు భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశం కానున్నట్లు సమాచారం.
మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ?
శాసనసభ ఎన్నికలు సమీపిస్తుండటం సహా.. యూపీలో మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ జరుగుతుందంటూ ఊహాగానాలు వెలువడుతున్న వేళ యోగి హస్తిన పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. 2022లో యూపీ శాసనసభకు జరగనున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ జరుగుతుందంటూ వార్తలు వెలువడుతున్నాయి.
ఎమ్మెల్సీ ఏకే శర్మకు కేబినెట్‌లో కీలక బాధ్యతలు దక్కే అవకాశముందనే ఊహాగానాలు సైతం ప్రచారంలోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో.. యోగి ఆదిత్యనాథ్ ప్రధాని మోదీతో భేటీ కానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇవీ చదవండి: దిల్లీకి యూపీ సీఎం యోగి- అందుకేనా?