ETV Bharat / bharat

మురికివాడలో భారీ అగ్నిప్రమాదం- గుడిసెలు దగ్ధం - మురికివాడ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం

యూపీలోని ఓ మురికివాడలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన జరగ్గా.. అక్కడి గుడిసెలు దగ్ధమయ్యాయి. మంటల్ని అదుపు చేశాయి అగ్నిమాపక దళాలు.

Fire breaks out in slum area in Ghaziabad's Bhopura
మురికివాడ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం
author img

By

Published : Apr 11, 2021, 12:34 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లోని గాజియాబాద్​లో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భోపురాలోని మురికివాడలో చెలరేగిన మంటల్లో అక్కడి గుడిసెలు కాలి బూడిదయ్యాయి.

మురికివాడ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం

ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అగ్నికీలల్ని ఆర్పేందుకు 8 అగ్నిమాపక శకటాలతో సిబ్బంది రంగంలోకి దిగారు. తీవ్రంగా శ్రమించి మంటల్ని అదుపులోకి తెచ్చారు.

మురికివాడల్లోని ప్రజలంతా నిద్రిస్తున్న వేళ.. అర్ధరాత్రి సమయంలో మంటలు చెలరేగి, ఆ ప్రాంతమంతా వ్యాపించాయని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు చెప్పారు.

అయితే.. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి: లారీలో మంటలు- లక్షల విలువైన సరకు దగ్ధం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.