ETV Bharat / bharat

Uterus In Man Body : యువకుడి కడుపులో గర్భాశయం.. పొట్ట నొప్పి వస్తుందని ఆస్పత్రికి వెళ్తే షాక్

Uterus In Man Body : 27 ఏళ్ల యువకుడిలో అభివృద్ధి చెందని గర్భాశయాన్ని గుర్తించారు వైద్యులు. అనంతరం సుమారు గంటన్నర పాటు ఆపరేషన్​ చేసి దానిని తొలగించారు.

Uterus In Man Body
Uterus In Man Body
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 1, 2023, 7:39 PM IST

Updated : Oct 1, 2023, 7:53 PM IST

Uterus In Man Body : కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన ఓ యువకుడిలో అభివృద్ధి చెందని గర్భాశయాన్ని గుర్తించారు వైద్యులు. దాదాపు గంటన్నర పాటు శ్రమించి ఆపరేషన్​ చేసి తొలగించారు డాక్టర్లు. ఈ ఘటన ఛత్తీస్​గఢ్​లోని ధమ్​తరి జిల్లాలో జరిగింది. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెప్పారు.

ఇదీ జరిగింది
ధమ్​తరికి చెందిన 27 ఏళ్ల యువకుడు కొద్దిరోజులుగా కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. దీంతో సెప్టెంబర్​ 25న సమీపంలోని ఆస్పత్రిలో సంప్రదించగా.. పరీక్షలు చేసి ఆపరేషన్ చేయాలని సూచించారు వైద్యులు. వెంటనే శస్త్రచికిత్స మొదలుపెట్టిన వైద్యులకు ఊహించని షాక్ తగిలింది. యువకుడి కడుపులో అభివృద్ధి చెందని గర్భాశయాన్ని గుర్తించిన డాక్టర్లు కంగుతిన్నారు. యువకుడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చిన వైద్యులు.. దాదాపు గంటన్నర పాటు ఆపరేషన్​ చేసి కడుపులో నుంచి గర్భాశయాన్ని తొలగించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగానే ఉందని.. మరికొన్ని రోజులు చికిత్స అందించాలని తెలిపారు.

"ప్రస్తుతం యువకుడు ఆరోగ్యంగా ఉన్నాడు. అతడు ఇప్పుడు చెప్పకపోతే సమస్య మరింత తీవ్రంగా మారేది. భవిష్యత్తులో క్యాన్సర్​ వచ్చే ప్రమాదం కూడా ఉండేది."

--రోషన్​ ఉపాధ్యాయ్​, డాక్టర్

ఇలాంటి కేసులు చాలా అరుదుగా వస్తాయని.. ప్రపంచంలోనే ఇది 300 కేసు అని వైద్యులు చెప్పారు. ఛత్తీస్​గఢ్​లో ఇలా జరగడం ఇదే మొదటిసారి అని తెలిపారు. సాధారణంగా ఇలాంటి కేసులు జన్మించే సమయంలోనే గుర్తిస్తామని.. ఆరేళ్ల వయసులోపే ఆపరేషన్​ చేసి నయం చేస్తామన్నారు. కానీ గ్రామాల్లో మంత్రసానులు ప్రసవం చేస్తే వారు గుర్తించరని వివరించారు. ఈ ఆపరేషన్​ను డాక్టర్​ రోషన్​ ఉపాధ్యాయ్ నేతృత్వంలో డాక్టర్​ ప్రదీప్​ దేవగణ్​, డాక్టర్​ రష్మీ ఉపాధ్యాయ్​, డాక్టర్ మార్టిన్​ ముకేశ్​తో కూడిన వైద్యుల బృందం చేసింది.

60 ఏళ్ల వృద్ధుడి కడుపులో గర్భాశయం.. రిపోర్ట్స్ చూసి డాక్టర్లు షాక్..!
కిడ్నీ సమస్యతో ఆస్పత్రికి వచ్చిన ఓ వృద్ధుడి రిపోర్ట్స్ చూసిన వైద్యులు షాక్​కు గురయ్యారు. ఆ వృద్ధుడికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ తీయగా కడుపులో గర్భాశయం ఉన్నట్లు తేలింది. ఈ అరుదైన సంఘటన బిహార్​ ఛప్రాలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందో తెలుసకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

పిత్తాశయంలో రాళ్లకు బదులు మహిళ గర్భాశయాన్ని తొలగించిన డాక్టర్.. మూడేళ్లకు కేసు!

యువకుడిలో స్త్రీ అవయవాలు.. కడుపులో గర్భాశయం, అండాశయం.. అర్ధనారీశ్వరుడు అంటూ..

Last Updated : Oct 1, 2023, 7:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.