కారు, బైక్ డ్రైవింగ్ చేస్తూ.. బ్లూటూత్, హెడ్‌ఫోన్స్(bluetooth earphones while driving ) వినియోగించటం చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు బెంగళూరు నగర పోలీసులు(bengaluru police). డ్రైవింగ్‌లో వాటిని నిషేధిస్తూ కొత్త ట్రాఫిక్ నిబంధనలు(new traffic rules) అమలులోకి తెచ్చారు.
డ్రైవింగ్ చేస్తూ హెడ్‌ఫోన్స్, బ్లూటూత్ వినియోగిస్తే.. చలాన్లు జారీ చేస్తామని స్పష్టం చేశారు బెంగళూరు పోలీసులు. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే.. కనిష్ఠంగా రూ.1000, ఆపైన నిబంధనల ఉల్లంఘనలను బట్టి ఫైన్ ఉంటుందని తెలిపారు. డ్రైవింగ్‌లో ఎలక్ట్రానిక్ వస్తువులను(electronic devices while driving) వినియోగించటం చట్టవిరుద్ధమని, వాహనదారులు దీనిని తెలుసుకుని, నిబంధనలకు లోబడి మెలగాలని హితవు పలికారు.
ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఫోన్ మాట్లాడినా...
రోడ్డుపై వెళుతున్నప్పుడు రెడ్ సిగ్నల్ పడితే ఆగుతాం. ఏదైనా ఫోన్ వస్తే మాట్లడటం చేస్తుంటారు కొందరు. అయితే.. అది కూడా తప్పేనని చెబుతున్నారు పోలీసులు. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఫోన్ మాట్లాడితే.. ఇతర వాహనదారులపై ప్రభావం పడుతుందని, ఒకవేళ ఫోన్ మాట్లాడుతూ దొరికిపోతే చలాన్ వస్తుందని గుర్తు చేశారు.
మరోవైపు.. వెనకాల కూర్చున్న వ్యక్తి ఫోన్ పట్టుకుని రైడర్ మాట్లాడినా నిబంధనల ఉల్లంఘనే అవుతుందంటున్నారు పోలీసులు. ఏ విధంగా మాట్లాడినా అది రైడర్‌తో పాటు ఇతర వాహనదారులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని స్పష్టం చేశారు. అలాగే.. కారులో డ్రైవర్ పక్కన ఉండే మరో వ్యక్తి లౌడ్‌స్పీకర్ పెట్టి ఫోన్ మాట్లాడినా.. దానితో డ్రైవర్‌కు ఎలాంటి సంబంధం లేకపోయినా ఉల్లంఘనే అవుతుందని తెలిపారు.
ఇదీ చూడండి: బ్లూటూత్ సురక్షితమేనా?.. కాదా?