మూడు రోజుల పర్యటనలో భాగంగా అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్.. భారత్‌కు శుక్రవారం చేరుకున్నారు. ఇరు దేశాల వ్యూహాత్మక బంధాలను బలోపేతం చేసుకునే దిశగా.. ఆయన పర్యటన సాగనుంది.
దిల్లీలోని సౌత్‌బ్లాక్‌లో శనివారం ఉదయం 11 గంటలకు.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో లాయిడ్ భేటీ కానున్నారు. ఈ భేటీకి ముందు ఉదయం 10:45 గంటలకు యుద్ధ స్మారకం వద్ద ఆస్టిన్ నివాళులు అర్పించనున్నారు.
