ETV Bharat / bharat

మోదీతో అమెరికా రక్షణ మంత్రి భేటీ - మోదీతో భేటీ అయిన ఆస్టిన్​

మూడు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా.. శుక్రవారం భారత్​కు వచ్చారు అమెరికా రక్షణ మంత్రి లాయిడ్​ జే ఆస్టిన్. ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమైన ఆయన.. ఇండో-పసిఫిక్​ ప్రాంతంలో భారత్​ ఎదుర్కొంటున్న కఠిన సవాళ్లపై చర్చించారు. అనంతరం.. జాతీయ భద్రతా సలహాదారు అజిత్​ డోభాల్​తోనూ భేటీ అయ్యారు.

US Defence Secretary Austin calls on Modi
మోదీతో అమెరికా రక్షణ కార్యదర్శి భేటీ
author img

By

Published : Mar 19, 2021, 10:15 PM IST

అమెరికా రక్షణ మంత్రి లాయిడ్​ జేమ్స్​ ఆస్టిన్​.. తన మూడు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా శుక్రవారం భారత్​కు వచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయిన ఆయన.. ఇండో-పసిఫిక్​ ప్రాంతంలో భారత్​ ఎదుర్కొంటున్న కఠిన సవాళ్లను గురించి చర్చించారు. ఆ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు కోసం భారత్​తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పెంచుకోవాలని యూఎస్​ కోరుతోందని ఆస్టిన్​ అన్నారు. ఇరుదేశాల పరస్పర సహకారంతో రక్షణ భాగస్వామ్యం మరింత విస్తరిస్తుందని చెప్పారు.

"భారత్​లో ఉండటం చాలా ఆనందంగా ఉంది. భారత్​-యూఎస్ మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి అమెరికా నిరంతరం కృషి చేస్తుంది. ఇండో-పసిఫిక్ ప్రాంతం ఎదుర్కొంటున్న కఠిన సవాళ్లను పరిష్కరించేందుకు మేము కలిసి పనిచేస్తున్నాం. ఫలితంగా ఇరుదేశాల సహకారంతో రక్షణ భాగస్వామ్యం మరింత విస్తరిస్తుంది."

- లాయిడ్​ జేమ్స్​ ఆస్టిన్​, అమెరికా రక్షణ మంత్రి

రక్షణ మంత్రిగా ఆస్టిన్​కు ఇదే తొలి అధికారిక పర్యటన కాగా.. ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు స్వాగతం పలికారు. ఆస్టిన్​తో సమావేశం కావడంపై హర్షం వ్యక్తం చేశారు.

PM Modi tweet
ప్రధాని మోదీ ట్వీట్​

"అమెరికా రక్షణ మంత్రితో భేటీ కావడం సంతోషంగా ఉంది. అధ్యక్షుడు జో బైడెన్​కు నా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రపంచ శాంతి కోసం ఇరు దేశాలు వ్యూహాత్మక భాగస్వామ్యానికి కట్టుబడి ఉన్నాయి."

- ప్రధాని నరేంద్ర మోదీ.

జాతీయ భద్రతా సలహాదారు అజిత్​ డోభాల్​ను కూడా ఆస్టిన్ కలిశారు.

Ajith Dhobal
ఆస్టిన్​ను కలిసిన అజిత్​ డోభాల్​

భారత పర్యటనకు ముందు ఆస్టిన్​.. జపాన్​, దక్షిణ కొరియాలను సందర్శించారు.

ఇదీ చదవండి:బంగాల్​ తొలి దశలో 25% అభ్యర్థులపై క్రిమినల్ కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.