Woman Commits Suicide: రాజస్థాన్ బికనీర్‌లో వేగంగా వస్తున్న రైలు కింద పడి మరణించింది 40 ఏళ్ల వివాహిత. ఈ ఘటన సోమవారం జరిగిందని పోలీసులు తెలిపారు. తన భర్త మేనల్లుడి (45) హత్యతో మనస్తాపం చెంది ఈ మేరకు ఆత్మహత్యకు పాల్పడిందని వెల్లడించారు. అతడితో ఆమెకు వివాహేతర సంబంధం ఉందని చెప్పారు. మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి, అనంతరం కుటుంబ సభ్యులకు అందజేశారు పోలీసులు. కేసు దర్యాప్తులో ఆమె ప్రియుడిని భర్తే హతమార్చినట్లు తేలిందని అధికారులు తెలిపారు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
నన్నెందుకు ప్రేమించవ్?.. యువతిపై ఘాతుకం: మహారాష్ట్రలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తనను ప్రేమించలేదన్న కోపంతో యువతిని గొంతు కోసి చంపేశాడు. ఈ దారుణం ఔరంగాబాద్‌లో శనివారం చోటుచేకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని నాసిక్‌లోని నిఫడ్ తాలుకా లాసల్‌గాన్‌లో అతడి సోదరి ఇంట్లో అరెస్టు చేశారు.
ఈ ఘటనపై పోలీసులు సోమవారం తెలిపిన వివరాల ప్రకారం.. శరణ్‌సింగ్ సేథి (20) అనే వ్యక్తి సుఖ్‌ప్రీత్ కౌర్ (18) అనే యువతిని ఔరంగాబాద్ సమీపంలోని దేవగిరి కళాశాల సమీపంలో శనివారం మధ్యాహ్నం గొంతుకోసి చంపాడు. అనంతరం ఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. కళాశాలలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో డిగ్రీ చదువుతున్న యువతిని గొంతుకోసి చంపడానికి ముందు 'నన్ను ఎందుకు ప్రేమించవు?' అని ఆమెపై అరిచినట్టు పోలీసులు పేర్కొన్నారు.
ఈ ఘటనపై ఔరంగాబాద్‌లోని వేదాంత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అయితే, ఈ నేపథ్యంలో అక్కడి పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు అప్రమత్తమైన నాసిక్ జిల్లా ఎస్పీ సచిన్ పాటిల్ సారథ్యంలోని బృందం నిందితుడిని అతడి సోదరి ఇంట్లో ఆదివారం అదుపులోకి తీసుకుంది.
ఇదీ చూడండి: ఇంట్లోనే దంపతుల దారుణ హత్య.. ఇద్దరు పిల్లలతో చెరువులో దూకిన తల్లి