ETV Bharat / bharat

ఆగస్టు 2 నుంచి సివిల్స్​ ఇంటర్వ్యూలు - యూపీఎస్​సీ ఇంటర్వ్యూలు

ఆగస్టు 2 నుంచి సివిల్​ సర్వీసెస్​ పరీక్ష-2020 ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్లు యూనియన్‌ పబ్లిక్ సర్వీస్‌ కమిషన్‌ ప్రకటించింది. ఎంపికైన అభ్యర్థుల కాల్​ లెటర్లను అధికారిక వెబ్​సైట్లలో అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు.

civil services interviews
సివిల్స్​ ఇంటర్వ్యూలు
author img

By

Published : Jun 10, 2021, 4:05 PM IST

సివిల్‌ సర్వీసెస్​ పరీక్ష-2020 ఇంటర్వ్యూలను ఆగస్టు 2 నుంచి నిర్వహించనున్నట్లు యూనియన్‌ పబ్లిక్ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్​సీ) ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితులను సమీక్షించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కరోనా కేసులు పెరగడం వల్ల ఏప్రిల్​ నెలలో ఈ ఇంటర్వ్యూలను వాయిదా వేసింది.

ఇంటర్వ్యూలకు సంబంధించిన కాల్​ లెటర్లను www.upsc.gov.in/www.upsconline.in అధికారిక వెబ్​సైట్లలో అభ్యర్థులకు అందుబాటులో ఉంచనున్నట్లు కమిషన్​ తెలిపింది. అయితే ఇంటర్వ్యూ తేదీ, సమయాల్లో ఎలాంటి మార్పులు చేయడం కుదరదని స్పష్టం చేసింది. ఈ ఏడాది మార్చి 23న విడుదల చేసిన యూపీఎస్​సీ ఫలితాల ఆధారంగా అభ్యర్థులను ఇంటర్వ్యూలకు ఎంపిక చేసినట్లు పేర్కొంది.

ఇదీ చూడండి: Viral: హెల్మెట్‌ను మింగిన ఏనుగు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.