ETV Bharat / bharat

'ఆయన నాయకత్వంలో కొత్త కూటమి అవసరం' - సంజయ్​ రౌత్​ శరద్​ పవార్​

శరద్​పవార్​ లాంటి సీనియర్​ నేత నాయకత్వంలో యూపీఏ కొత్త కూటమిగా రూపాంతరం చెందాల్సిన అవసరముందని శివసేన నాయకుడు సంజయ్​ రౌత్​ అన్నారు. ఇప్పటికే చాలా ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్​ను విడిచి పెట్టాయని తెలిపారు. వాటిని ఏకం చేయాలి అంటే పవార్​ లాంటి సీనియర్​ నేత అవసరం అని అభిప్రాయపడ్డారు.

UPA restructuring needed, Pawar should lead alliance: Raut
'ఆయన నాయకత్వంలో కొత్త కూటమి అవసరం'
author img

By

Published : Mar 1, 2021, 11:55 AM IST

చాలా ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్​తో కలిసి పని చేసేందుకు మొగ్గుచూపడం లేదని శివసేన నాయకుడు సంజయ్​ రౌత్ అన్నారు. ఈ క్రమంలో యూపీఏని తిరిగి పునర్నిర్మించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ కొత్త కూటమికి శరద్​పవార్​ లాంటి సీనియర్​ నేత నాయకత్వం వహించాలని కోరారు. యూపీఏ భవిష్యత్తు అంతా కాంగ్రెస్​ చేసే త్యాగాల మీదే ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. ఔరంగాబాద్​లో ఓ కార్పొరేటర్​ ఏర్పాటు చేసిన 'జై భీమ్​ వేడుక'లో పాల్గొన్న సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

దేశంలో ఎన్​డీఏ లేదన్న రౌత్​... ఇప్పటికే చాలా పార్టీలు కూటమి నుంచి వైదొలిగినట్లు గుర్తు చేశారు. అదే క్రమంలో యూపీఏ కూడా కనుమరుగవుతుందని జోస్యం చెప్పారు.

"యూపీఏకు భవిష్యత్తు లేదు. తిరిగి పునర్నిర్మించాలంటే శరద్ పవార్ లాంటి సీనియర్ నాయకుడు నాయకత్వం వహించాలి. అది జరిగితే, మరిన్ని పార్టీలు యూపీఏలో భాగం అవుతాయి. కాంగ్రెస్ అంగీకారం లేకుండా ఇది జరగడం కష్టం. కూటమి భవిష్యత్తు అనేది కాంగ్రెస్ చేసే త్యాగం,నాయకులు ఉదారతపై ఆధారపడి ఉంటుంది

- సంజయ్​ రౌత్, శివసేన నాయకుడు

దేశ రాజకీయాలకు కేంద్ర బిందువుగా ఉండాల్సిన దిల్లీలో.. ప్రభుత్వం స్తబ్దుగా ఉందని రౌత్​ అన్నారు. మాట్లాడే కొద్దిమందిని కూడా అణిచివేస్తున్నారని ఆరోపించారు. కనీసం ఇతరులను కలిసే స్వేచ్ఛ కూడా లేకుండా పోయిందని రౌత్​ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రే లాంటి నాయకులు దిల్లీలో ఉండాల్సి ఉందని అన్నారు.

ఇదీ చూడండి: 'కాంగ్రెస్​ పతనంతో ప్రజాస్వామ్యానికి ముప్పు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.