ETV Bharat / bharat

నిద్ర మత్తులో అంబులెన్స్​ డ్రైవర్.. ఒకే కుటుంబంలో ఆరుగురు బలి - గుజరాత్​ రోడ్డు ప్రమాదం

up accident: అంబులెన్స్​, ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మొత్తం ఏడుగురు చనిపోగా.. మరో వ్యక్తి అంబులెన్స్​ డ్రైవర్​. ఈ ప్రమాదం ఉత్తర్​ప్రదేశ్​ బరేలీలోని ఫతేగంజ్​లో మంగళవారం ఉదయం జరిగింది. మరో ప్రమాదంలో పదేళ్ల బాలుడు సహా ఐదుగురు మరణించారు.

up accident
up accident
author img

By

Published : May 31, 2022, 9:58 AM IST

Updated : May 31, 2022, 9:21 PM IST

up accident: ఉత్తర్​ప్రదేశ్​ బరేలీలోని ఫతేగంజ్​లో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అంబులెన్స్​, ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. భోజిపుర నుంచి దిల్లీ వెళుతున్న అంబులెన్స్ అదుపు తప్పి.. డివైడర్​ను​ దాటి​ ఓ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులు మరణించారు. చనిపోయిన మరో వ్యక్తి అంబులెన్స్​ డ్రైవర్​. అంబులెన్స్​ డ్రైవర్​ నిద్రమత్తులో ఉండడమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ సంతాపం తెలిపారు.

up accident
ప్రమాదం దృశ్యం

పదేళ్ల బాలుడు సహా ఐదుగురు దుర్మరణం: మినీ బస్సు, ఆటో ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృతిచెందగా.. మరో ఐదుగురు గాయపడ్డారు. ఈ ప్రమాదం గుజరాత్​లోని పలన్​పుర్​లో సోమవారం సాయంత్రం జరిగింది. రాజస్థాన్​ నుంచి వస్తున్న మినీ బస్సు ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రయాణికులు అక్కడిక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మృతుల్లో పదేళ్ల బాలుడు, ముగ్గురు మహిళలు, ఓ పురుషుడు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారికి పలన్​పుర్​​ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు.

ఇదీ చదవండి: భార్య, తల్లిదండ్రులను కాల్చి చంపిన భర్త

Last Updated : May 31, 2022, 9:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.