Road Accident Siddharthnagar: ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థ్‌నగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ట్రక్కును అతివేగంగా వచ్చిన బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో 9 మంది దుర్మరణం చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
క్షతగాత్రులను సిద్ధార్థ్‌నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రమాదంలో బొలెరో వాహనం పూర్తిగా ధ్వంసమైంది. మితిమీరిన వేగానికి తోడు.. డ్రైవర్ నిద్రే ప్రమాదానికి కారణమని పోలీసు అధికారులు అనుమానిస్తున్నారు.
![UP Road Accident: 8 killed in car-truck collision in Siddharthnagar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15353344_accident.jpg)
![UP Road Accident: 8 killed in car-truck collision in Siddharthnagar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15353344_-up-road-accident.jpg)
ఇవీ చూడండి: షాపింగ్ మాల్‌పై నుంచి జారిపడి యువతి మృతి.. ఏం జరిగింది?