ETV Bharat / bharat

వ్యాక్సిన్ వద్దని నదిలో దూకి పరార్​! - టీకాపై వ్యతిరేకత

కొవిడ్​ టీకా వేసేందుకు ఆ గ్రామానికి చేరుకున్నారు ఆరోగ్య సిబ్బంది. కానీ, వారిని చూడగానే.. భయపడిన గ్రామస్థులు నదిలో దూకి పరారయ్యారు. వ్యాక్సిన్​పై ప్రజలకు ఇంకా ​అపోహలు వీడలేదనడానికి సాక్ష్యంగా నిలిచిన ఈ సంఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది.

vaccine
వ్యాక్సిన్​
author img

By

Published : May 24, 2021, 7:20 AM IST

కరోనాను ఎదుర్కోవడానికి టీకానే ప్రధాన ఆయుధమని ప్రభుత్వం ఎంతగానో చెబుతోంది. కానీ, ఇప్పటికీ.. కొంతమంది మాత్రం వ్యాక్సిన్​పై తమకు ఉన్న అపోహలను వీడటం లేదు. టీకా​ తీసుకునేందుకు ఇష్టపడని కొంతమంది నదిలో దూకి పరారయ్యారు. ఈ సంఘటన ఉత్తర్​ప్రదేశ్​ బారాబంకి జిల్లా సిసౌరా గ్రామంలో శనివారం జరిగింది.

'టీకా కాదది.. విషం'

లబ్ధిదారులకు టీకా వేసేందుకు ఆరోగ్య సిబ్బంది.. సిసౌరాకు చేరుకున్నారు. వారిని చూడగానే కొంతమంది.. సమీపంలోని సరయు నదిలోకి దూకి పరారయ్యారని రామ్​నగర్​ తాలుకా సబ్​డివిజనల్​ మేజిస్ట్రేట్​ రాజీవ్​ కుమార్ శుక్లా తెలిపారు. తాము టీకా తీసుకుంటే కలిగే ప్రయోజనాలను, టీకాపై ఉన్న అపోహలను గ్రామస్థులకు వివరించామని చెప్పారు. అనంతరం.. 18 మంది టీకా తీసుకున్నారని వివరించారు. అయితే.. 'అది కరోనా టీకా కాదని విషపూరితమైన ఇంజెక్షన్'​ అని తమకు కొంతమంది చెప్పగానే.. తాము నదిలోకి దూకామని ఆ గ్రామస్థులు తెలిపారు.

ఇదీ చూడండి: గుర్రానికి అంత్యక్రియలు- వేల మంది హాజరు

ఇదీ చూడండి: వైరల్​: మితిమీరిన వేగం- ఎగిరి పడ్డ ట్రక్కు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.