UP Poll Campaign: మరికొద్దిరోజుల్లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ముఖ్యంగా అందరిదృష్టి ఉత్తర్‌ప్రదేశ్‌పైనే నెలకొంది. ఈ నేపథ్యంలో ఓటర్లను ఆకర్షించేందుకు ఆయా పార్టీల కీలక నేతలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.
Priyanka Gandhi door-to-door campaign: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా శనివారం.. ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్‌కు ఓటేయాలని అలీగఢ్ ఖైర్ నియోజకవర్గంలోని ఓటర్లను ఆమె అభ్యర్థించారు.
![: Priyanka Gandhi Vadra campaign](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14380647_vadra.jpg)
![: Priyanka Gandhi Vadra campaign](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14380647_priyanka-gandhi.jpg)
స్థానికులకు అభివాదం చేసుకుంటూ వెళ్లిపోయారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
యోగీ ప్రచారం..
గోరఖ్‌పుర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఇంటింటి ప్రచారం ప్రారంభించారు.
భాజపాతోనే అభివృద్ధి సాధ్యం..
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల ప్రచారం షురూ చేశారు. బల్దేవ్, ఖేరాగఢ్, ఆగ్రా రూరల్ స్థానాల్లో బహిరంగ సమావేశాలు నిర్వహించారు.
![rajnath singh campaign](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14380647_raj-nath.jpg)
ఈ సందర్భంగా.. రాష్ట్రంలో అభివృద్ధి భాజపాతోనే సాధ్యమని అన్నారు. సమాజ్‌వాదీ పార్టీ బుజ్జగింపు రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. రాజకీయాలు ప్రభుత్వ ఏర్పాటు కోసం కాకుండా.. అభివృద్ధి, సంక్షేమం చేయాలని అన్నారు.
![rajnath](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14380647_rajnath-singh.jpg)
''సమాజ్‌వాదీ పార్టీ బుజ్జగింపు రాజకీయాలు చేస్తోంది. ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం రాజకీయాలు చేయాలి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికే కాదు. కులమతాల ఆధారంగా రాజకీయాలు చేయకూడదు. సమాజ్‌వాదీ పార్టీ ఇలాంటి నీచ రాజకీయాలే చేస్తోంది.''
- రాజ్‌నాథ్ సింగ్, రక్షణ మంత్రి
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపైనా.. రాజ్‌నాథ్ విమర్శలు గుప్పించారు. ఆయన చదివిన ప్రతి దాన్నీ నమ్ముతారని, చైనా విషయంలోనూ అలాగే పొరబడ్డారని అన్నారు. భారత సరిహద్దులు సురక్షితంగానే ఉన్నాయని ఉద్ఘాటించారు.
400 స్థానాలు మావే..
Akhilesh Yadav Campaign: ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ముందు అలీగఢ్‌లో మాట్లాడిన సమాజ్‌వాదీ అధినేత అఖిలేశ్ యాదవ్.. కీలక వ్యాఖ్యలు చేశారు. యూపీ భాజపా ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని.. ఎన్నికల్లో దానిని నిరూపిస్తారని అన్నారు.
![AKHILESH YADAV](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14380647_akhilesh-yadav.jpg)
- మొత్తం 403 స్థానాలకుగానూ.. ఎస్పీ- ఆర్ఎల్డీ కూటమే 400 చోట్ల నెగ్గుతుందని జోస్యం చెప్పారు. మిగతా అన్నింటికీ కలిపి 3 స్థానాలే దక్కుతాయని పేర్కొన్నారు.
- రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, ఇది యోగి ప్రభుత్వం వైఫల్యమేనని విమర్శించారు. హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై కాల్పుల ఘటనే ఇందుకు నిదర్శనమని ఆరోపించారు.
UP Poll 2022: ఉత్తర్‌ప్రదేశ్‌లో మొత్తం ఏడు దశల్లో పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 10న తొలి దశ ఎన్నికలు నిర్వహించనున్నారు. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి.
చివరగా 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా అఖండ విజయం సాధించింది. ఏకంగా 312 చోట్ల నెగ్గి.. సంపూర్ణ మెజరిటీ సొంతం చేసుకుంది. సమాజ్‌వాదీ పార్టీ 47 చోట్ల గెలుపొందింది. బీఎస్పీ 19, కాంగ్రెస్ 7 స్థానాలకు పరిమితమయ్యాయి.
ఇవీ చూడండి: UP Election 2022: భాజపాకు సై.. యోగికి నై!
యూపీ సీఎం యోగి ఆస్తుల విలువ ఎన్ని కోట్లో తెలుసా?
Amritsar East: సిద్ధూ పంజా విసురుతారా? మజీఠియా షాక్ ఇస్తారా?