ప్రధాని నరేంద్ర మోదీని కించపరిచేలా ఉన్న ఓ వీడియో కేసులో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌పై ఎఫ్ఆర్ నమోదు చేసి, కొన్ని రోజుల్లోనే తొలగించారు ఉత్తర్ ప్రదేశ్‌లోని వారణాసి పోలీసులు. సుందర్ పిచాయ్‌తో పాటు ఆ సంస్థకు చెందిన ముగ్గురికి ఈ కేసుతో సంబంధం లేదని ఎఫ్ఐఆర్ నుంచి వారి పేర్లను తొలగించినట్లు తెలిపారు.
మోదీ ప్రతిష్ఠను దిగజార్చేలా ఉన్న వీడియోను వారణాసికి చెందిన ఓ వ్యక్తి వాట్సాప్ గ్రూపుల్లో, యూట్యూబ్‌లో చూశాడు. దానిపై అభ్యంతరం వ్యక్తం చేయగా... 8,500 బెదిరింపు కాల్స్ వచ్చాయంటూ పోలీసులుకు ఫిర్యాదు చేశాడు. దాంతో పిచాయ్‌తో పాటు మరో 17 మందిపై ఫిబ్రవరి 6న పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఇదీ చూడండి: గూగుల్ సంస్థపై అమెరికా న్యాయశాఖ దావా